Weather Updates: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు - పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
Temperature in Telangana: తూర్పు తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 వరకు నమోదు అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Temperature in Andhra Pradesh: పొడి గాలులు పెరగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గత మూడు రోజులుగా మధ్యాహ్నం సమయంలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో కడప, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 వరకు నమోదు అయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ కొన్నిచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఎండలు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం పొడిగా మారింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అత్యధికంగా జంగమేశ్వరపురంలో 37.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోత, తేమ ప్రభావం అధికం కావడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అమరావతిలో 36.5 డిగ్రీలు, కావలిలో 36.3 డిగ్రీలు, నెల్లూరులో 36.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. అత్యధికంగా కర్నూలులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో 39.4, నంద్యాలలో 38.8 డిగ్రీలు, తిరుపతిలో 38.3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.
Daily weather report for Andhra Pradesh dated 28.03.2022 pic.twitter.com/x16kfXLbB9
— MC Amaravati (@AmaravatiMc) March 28, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాలైన మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఆకాశం మేఘావృతామై ఉంటుంది. కానీ వర్ష సూచన తక్కువగా ఉంది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్ అర్బన్, రూరల్, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎండలు 42-43 డిగ్రీలను తాకుతున్నాయి.
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్! నేడు తగ్గిన బంగారం ధర, వెండి కూడా దిగువకు