Top Headlines: కవిత ఈడీ కస్టడీ పొడిగింపు - ఉన్నతాధికారుల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు, అభ్యర్థుల వర్క్ షాప్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ ఇక్కడ చదివేయండి.
Today Top Headlines On March 23rd:
1. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడు రోజులు పొడిగించారు. ఇప్పటికే ఏడు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించాల్సింది ఇంకా చాలా ఉందని.. ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలపడంతో మూడ్రోజులపాటు కస్టడీకి న్యాయస్థానం అంగీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. ఉన్నతాధికారుల మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆరు రోజులుగా మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును విచారిస్తున్న పోలీసులు కీలక అంశాలు రాబట్టారని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఉన్నతాధికారుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, అడిషనల్ చీఫ్ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్, డీఎస్పీ తిరుపతన్న పేర్లు ప్రణీత్‌రావు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన సమాచారంతో ఈ నలుగురి ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. ప్రాణం పోతున్నా ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. కానీ.. ఆయన చూపిన ముందుజాగ్రత్త, సమయస్ఫూర్తి వల్ల... బస్సులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. తన ప్రాణం మీదకు వచ్చినా కూడా ఆర్టీసీ డ్రైవర్ బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించాడు. గుండెపోటుతో బాధపడుతూ కూడా బస్సును జాగ్రతగా పక్కకు ఆపాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. అభ్యర్థుల వర్క్ షాప్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి , త్యాగం చేసిన సీనియర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్నారు. వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక
మీరు ఈనెలలో ప్రయాణం పెట్టుకున్నారా..? రైల్లో వెళ్లాలని భావిస్తున్నారా..? ఇప్పటికే ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారా...? అయితే ఇది మీకోసమే. ఆంధ్రప్రదేశ్ మీదుగా రైలు ప్రయాణం చేసేవారికి... దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. పలు రైల్వే లైన్‌లో జరుగుతున్న డబ్లింగ్ పనుల వల్ల.. కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు ప్రకటించింది. ఈ నెలాఖరు వరకు.. రైళ్ల మల్లింపు ఉంటుంది.. ప్రయాణికులు గమనించాలని సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.