Telangana: ప్రజా పాలన నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం, ఉత్తర్వులు జారీ
Praja Palana Program in Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమం కోసం నోడల్ అధికారులను నియమించింది.
Nodal Officers for Praja Palana Program: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన (Praja Palana) కార్యక్రమం డిసెంబర్ 28న ప్రారంభమై వచ్చే జనవరి 6న ముగియనుంది. ఈ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకుగానూ ఉమ్మడి జిల్లాలకు ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులు (Nodal Officers)గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ లను నోడల్ అధికారులగా నియమించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.
ఉమ్మడి జిల్లాలు - నోడల్ అధికారులు
- కరీంనగర్ - ఏ. దేవసేన
- మహబూబ్‌నగర్ - టి.కె శ్రీదేవి
- ఖమ్మం - ఎం. రఘునందన్‌రావు
- రంగారెడ్డి - ఇ. శ్రీధర్
- వరంగల్ - వాకాటి కరుణ
- హైదరాబాద్ - కె. నిర్మల
- మెదక్ - ఎస్.సంగీత
- ఆదిలాబాద్ - ఎం. ప్రశాంతి
- నల్గొండ - ఆర్.వి. కర్ణన్
- నిజామాబాద్ - క్రిస్టినా