By: ABP Desam | Updated at : 25 Mar 2023 09:19 AM (IST)
Edited By: jyothi
రాబోయే మూడ్రోజులు తెలంగాణలో వడగాళ్ల వర్షాలు!
Telangana Weather Report: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిస్తాయని ప్రకటించింది నిజామాబాద్, ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వడగాళ్ల వానలకు అవకాశం ఉందంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే పగటి పూటంతా ఎక్కువగా ఉష్ణోగ్రత సాయంత్రం సమయంలో వర్షాలు పడే ఛాన్స్ అధికంగా ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వివరించారు. ప్రస్తుతం సాధారణం కంటే 1 డిగ్రీ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 24, 2023
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 25, 2023
ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
తమిళనాడు నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రస్తుతం రాయలసీమ నుంచి దక్షిణ జార్ఖండ్ వరకు తెలంగాణ, ఒడిశాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం అనకాపల్లి, కాకినాడ, ఎస్పీఎస్సార్ నెల్లూరు, కృష్ణా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా కొక్కిరాలపల్లిలో 9.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సామర్లకోటలో 7.8, యలమంచిలో 7.7, కావలిలో 4.6, గుడివాడలో 4.2, మల్లాదిలో 3.7, ఉప్పలపాడులో 3.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
7 day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated: 24/03/2023 pic.twitter.com/Mblx2SyP4H
— IMD_Metcentrehyd (@metcentrehyd) March 24, 2023
హైదరాబాద్ లో ఇలా...
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.
ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఐదు నెలల్లో ఢిల్లీలో అత్యంత స్వచ్ఛమైన గాలి మంగళవారం నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 75కి మెరుగుపడిన తర్వాత పరిస్థితి 'సంతృప్తికరమైన' కేటగిరీలో ఉంది. అంతకుముందు ఢిల్లీలో గతేడాది అక్టోబర్ 11న ఏక్యూఐ 66 కంటే తక్కువగా నమోదైంది. వర్షం, బలమైన గాలులు ఢిల్లీ గాలిని క్లియర్ చేశాయి.
KTR Tweet on MODI: మోదీజీ మూడు హామీల సంగతేంటి- ప్రధాని పర్యటనపై కేటీఆర్ కౌంటర్
Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !
Telangana Election 2023: వచ్చే వారంలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా! ప్రచారంలో స్పీడ్ పెంచిన కమలం పార్టీ
Telangana Assembly Elections: నేడు హైదరాబాద్‌కు కేంద్ర ఎన్నికల అధికారులు, 3 రోజులు ఇక్కడే - అసెంబ్లీ ఎలక్షన్స్ సన్నద్ధతపై రివ్యూ
PM Modi Nizamabad Tour: నేడు నిజామాబాద్‌కు ప్రధాని మోదీ, తెలంగాణ టార్గెట్‌గా వరుసగా పర్యటనలు
India Vs Nepal: ఏసియన్ గేమ్స్‌లో సెమీస్‌లోకి భారత క్రికెట్ జట్టు - నేపాల్‌పై ఘన విజయం
Telangana Congress Side Effects : తెలంగాణ కాంగ్రెస్‌కు చేరికల సైడ్ ఎఫెక్టులు - బుజ్జగించలేకపోతున్నారా ?
Supreme Court: నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ - వీరి బెంచ్ వద్ద లిస్టింగ్
Salman Khan - Somy Ali : నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు
/body>