తెలంగాణలో తగ్గిన ఓటర్లు, శేరిలింగంపల్లి టాప్, అశ్వరావుపేట లాస్ట్
సవరణలు, మార్పులు చేర్పులు తరువాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తాజా ఓటర్ల జాబితాను విడుదల చేిసింది ఎన్నికల కమిషన్.
ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన తాజా జాబితాలో తెలంగాణ వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 2కోట్ల 99 లక్షల 77వేల 659 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మార్పులు చేర్పులతో పూర్తి సవరణ తరువాత తాజాగా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యను జిల్లాల వారీగా విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 1 కోటి యాభై లక్షల 48 వేల 250 మంది పురుష ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు కోటి 49 లక్షల 24 వేల 718 ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓట్లు 2740 నమోదు కాగా, థర్డ్ జెండర్ ఓటర్లు వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్కటిగా లెక్కతేలింది. జిల్లాల వారీగా పరిశీలించినప్పుడు హైదరాబాద్ జిల్లా ఓటర్ల సంఖ్య 42 లక్షల 15 వేల 456కు చేరగా, రంగారెడ్డి జిల్లాలో ఓటర్ల సంఖ్య 31 లక్షల 8వేల 68గా తేలింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 25 లక్షల 24 వేల 951ఉన్నట్లు ఈసీ ప్రకటించింది.
నియోజకవర్గాల వారీగా తాజాగా ఓటర్ల సంఖ్య పెరుగుదల పరిశీలించినప్పుడు అత్యధికంగా శేరిలింగంపల్లి 64,4,072 మంది ఓటర్లుండగా, ఆ తరువాతి స్దానంలో కుద్బుల్లాపూర్ చేరింది. కుద్బుల్లాపూర్ (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) లో 61,2,700 లక్షమంది ఓటర్లు నమోదైయ్యారు. కుద్బుల్లా పూర్ తర్వాత స్దానంలో మేడ్చల్ నియోకవర్గం నిలిచింది. మేడ్చల్ నియోజకవర్గంలో 55,30,785మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ఓటర్లున్న నియోజకవర్గంగా భద్రాచలం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గం నిలిచింది. అశ్వరావు పేటలో కేవలం 14,90,322మంది ఓటర్లున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.
తాజాగా 2023 ఓటర్ల జాబితా సిద్దం చేసేందుకు ఎన్నికల కమీషన్ తీవ్ర కసరత్తులే చేసింది. ఎక్కడా ఎటువంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఓటర్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిచేసేందుక అన్ని చర్యలు తీసుకుంది. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఓటర్ల సంఖ్యను లెక్కించారు.తెలంగాణా వ్యాప్తంగా దాదాపు 1700 కాలేజీలలో ఎలక్షన్ లెర్నింగ్ కబ్స్ ఏర్పాటు చేసి 18 నుంచి 19సంవత్సరాల వయస్సున్న యువతీ ,యువకులను గుర్తించి ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా అవగాహాన కల్పించారు. ప్రతీ క్యాంపస్ లలో నిర్ణీత వయుస్సుగల విద్యార్దులకు నేరుగా సంబంధిత కాలేజీల సహకారంతో ఎస్ ఎమ్ ఎస్ లు పంపడం ద్వారా ఓటు హక్కు నమోదుపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గత ఏడాది ఓటర్ల సంఖ్య మూడు కోట్ల మూడు లక్షలు దాటితే ఈసారి విడుదల చేసిన జాబితాలో ఆ సంఖ్య రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షలకే పరిమితమ్వడం విశేషం. అంటే దాదాపు మూడు లక్షలకు పైగా ఓటర్లు గత ఏడాదితో పోల్చినప్పడు తగ్గారని ఎన్నికల కమీషన్ విడుదల చేసిన నివేదిక ఆధారంగా స్పష్టమవుతోంది.
ఈ ఏడాది ఇంకా ఓటు హక్కుల నమోదు చేసుకోనివారు ,లేదా సవరణలు కోరుకునే వారు వెంటనే NVSP వెబ్ సైట్ ద్వారా లేదా హెల్ప్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు జాబితాలో సవరణలు నిరంతర ప్రక్రియగా ఎన్నికల కమిషనర్ తెలపండంతో పాటు రాబోయే రోజుల్లో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపింది. ఫారం 8ను ఉపయోగించి చిరునామా మార్పులుంటే మొబైల్ యాప్ లేదా నేరుగా వెబ్ సైట్ ద్వారా సంవరణలు చేసుకోవాలని సూచిస్తోంది ఎన్నికల కమిషన్.