Jaya Jaya He Telangana: చరిత్రలో నిలిచిపోయేలా ‘జయ జయహే తెలంగాణ’ గీతం, పాడింది వీరే!
Telangana Formation Day 2024: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది.
Telangana Formation Day Celebrations: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా జూన్ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ (Jaya Jaya He Telangana) ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ గీతాన్ని స్వరపరిచే బాధ్యతను రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గీత రచయత అందెశ్రీ (Ande Sri), ఆస్కార్ విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి(MM Keeravani)కి అప్పగించారు. అప్పటి నుంచి దీని చుట్టూ రాజకీయాలు, వివాదాలు నడిచాయి. అన్నింటిని దాటుకుని ఈ గీతం రికార్డింగ్ పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని ఆలపించే అవకాశం యువ గాయకులు రేవంత్ (Singer Revanth), హారిక నారాయణ్ (Singer Harika Narayan)కు దక్కింది.
View this post on Instagram
ఈ విషయాన్ని సింగర్ హారిక నారాయణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాష్ట్ర గీతాన్ని ఆలపించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటం చరిత్రలో నిలిచిపోయే అంశమని, ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో తనను చేర్చుకున్నందుకు గీత రచయత అందె శ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, సీఎం రేవంత్ రెడ్డికిరేవంత్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ఈ గీతం ఆవిష్కరించబడుతుందని హారిక తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫిబ్రవరిలో అధికారిక గుర్తింపు
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరిలో ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించింది. తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ఈ గీతం ప్రజాదరణ పొందింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది మంది ఉద్యమకారుల్లో ఈ గీతం స్ఫూర్తి నింపింది. తెలంగాణలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ గీతంగా, ప్రార్థనా గీతంగా ఈ గేయాన్ని ఇప్పటికే ఆలపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ గేయానికి అధికారిక హోదా కల్పించారు.
కీరవాణికి స్వరపరిచే బాధ్యతలు
ఈ నేపథ్యంలోనే ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చాల్సిన బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డితో కీరవాణి భేటీ అయ్యారు. తెలంగాణ ఖ్యాతిని చాటిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు స్వరాలు చేకూర్చాలని కోరారు. కొద్దిరోజులకు హైదరాబాద్ రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జయ జయహే తెలంగాణ గేయంపై కవి అందెశ్రీ సంగీత దర్శకులు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర గేయం రికార్డింగ్ పూర్తయిందని తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు.
పరేడ్ గ్రౌండ్‌లో ఆవిష్కరణ
హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 10.30 గంటలకు జాతీయ జెండాను రేవంత్ ఆవిష్కరించారు.