(Source: ECI/ABP News/ABP Majha)
TS Polycet Results 2021: విడుదలైన పాలిసెట్ ఫలితాలు
తెలంగాణ పాలిసెట్ -2021 ఫలితాలు విడుదల అయ్యాయి. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, బైపీసీ విభాగంలో 76.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
తెలంగాణ పాలిసెట్ -2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి పాలిసెట్ ఫలితాలను వెల్లడించింది. ఫలితాలను పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ https://polycetts.nic.in/ తో పాటు sbtet.telangana.gov.in, dtets.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చని తెలిపింది. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, బైపీసీ విభాగంలో 76.42 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొంది.
తెలంగాణలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూలై 17వ తేదీన పాలిసెట్ పరీక్ష జరగ్గా.. 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. 92,557 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
షెడ్యూల్ ఇదే..
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సైతం ఇటీవలే సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. పాలిసెట్ కౌన్సెలింగ్ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కేటాయింపు ఆగస్టు 6 నుంచి 12 వరకు కొనసాగనుంది.
మొదటి విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 14వ తేదీన ఉంటుంది. ఆగస్టు 23న చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. 24న చివరి విడత ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. ఆగస్టు 24, 25 తేదీల్లో చివరి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. చివరి విడత సీట్లను ఆగస్టు 27న కేటాయిస్తారు. పాలిటెక్నిక్ విద్యాసంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి సెప్టెంబరు 9న మార్గదర్శకాలు విడుదల అవుతాయి.
ఎంపీసీలో టాప్ ర్యాంకర్లు
ర్యాంక్ | అభ్యర్థి పేరు | జిల్లా | మార్కులు |
1 | అబ్దుల్ రహమాన్ | నిజామాబాద్ | 118 |
2 | సాయి అశ్రిత‌్ | హైదరాబాద్ | 118 |
3 | సాయి విజ్ఞేష్ | హైదరాబాద్ | 118 |
4 | రోహన్ కుమార్ | హైదరాబాద్ | 118 |
5 | రమేష్ | యాదాద్రి | 118 |
ఎంబైపీసీలో టాప్ ర్యాంకర్లు
ర్యాంక్ | అభ్యర్థి పేరు | జిల్లా | మార్కులు |
1 | రిషిక | సిద్దిపేట | 117 |
2 | హిందుప్రియ | మంచిర్యాల | 115 |
3 | మాధవ్ | సిద్దిపేట | 113 |
4 | శ్రీవర్థన్ | వరంగల్ అర్బన్ | 113 |
5 | జ్ఞానేశ్వరి | యాదాద్రి | 112 |