IND in IRE, 2 T20Is, 2022 | 2nd T20I | Malahide Cricket Club Ground, Dublin - 28 Jun, 09:00 pm IST
(Match Yet To Begin)
IRE
IRE
VS
IND
IND

Telangana: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిలో దేశంలో మనమే నెంబర్ వన్

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రులు చెప్పారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ పై నిర్లక్ష్యం చేయవద్దని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.

FOLLOW US: 

సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలు తీరుతెన్నులపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. వెనుకబడిన పాలమూరు (ఉమ్మడి మహబూబ్ నగర్) జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రులు చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను మరింతగా అభివృద్ధి చేసే బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచులు తీసుకోవాలని మంత్రులు కోరారు. ప్రజా ప్రతినిధులు సూచించిన పనులు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ పై నిర్లక్ష్యం చేయవద్దని అదేశించారు.పెండింగ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, ఈ మార్చి కల్లా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధుల వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తాజాగా పంచాయతీ భవనాలు, కాలువల పూడిక తీత వంటి పనులకు కూడా ఉపాధి నిధులను వినియోగించుకోవాలని అధికారులకు చెప్పారు. అంతేగాక ఈ మార్చిలో గా సాధ్యమైనంత ఎక్కువ ఉపాధి పనులు చేయాలని అదేశించారు. కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన గ్రామ పంచాయతీలు, sc రిజర్వు గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై సీఎం కేసీఆర్ ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పారు. ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్వహణ వంటి విషయాల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనులు నిర్వహించాలన్నారు. కొత్త రోడ్లు, మురుగునీటి కాలువల పనులు కూడా త్వరలోనే వస్తాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

మరోవైపు గ్రామ కార్యదర్శులకు జియో ట్యాగింగ్ పెట్టామని, మహబూబ్ నగర్ జిల్లాలో కార్యదర్శులు, అధికారులు మరికొంత అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అదేశించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించింది. ఇది అరుదైన ఘనత, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా సాధ్యమైంది. దీన్ని నిలబెట్టుకోవడం మన విధి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. డంపింగ్ యార్డులలో చెత్త ద్వారా తీసిన ఎరువుల అమ్మకం ద్వారా రాష్ట్రంలో పంచాయతీలు 300 కోట్లు అర్జించాయని మంత్రి వివరించారు. అలాగే, స్కూల్స్ లో నర్సరీలను ఏర్పాటు చేసి, ప్లాంటేషన్ పెడితే, గ్రామ పంచాయతీలకు భారం తగ్గుతుందని సూచించారు.

రెగ్యూలేటర్ నిర్మాణం.. 
‘ఉపాధిహామీ కింద కాలువల పూడిక తీయాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చే ఇన్ ఫాల్ రెగ్యులేటర్ వెంటనే నిర్మించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానిని వెంటనే నిర్మించాలని గతంలోనే ఆదేశించారు. ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ కాలువల పూడిక తీయడానికి  అధిక ప్రాధాన్యం ఇచ్చి ఉపాధిహామీ కింద పూర్తి చేయాలి. అని అధికారులను అదేశించారు. రూరల్ వాటర్ సప్లైలో సంబంధిత ఏజెన్సీలలో క్షేత్రస్థాయిలో ఉద్యోగుల సంఖ్య పెంచి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణంలో దెబ్బతిన్న సీసీ రహదారులు వెంటనే సరిచెయ్యాలి .. లేదంటే గ్రామపంచాయతీలకు అప్పగించాలి. పీఎం జీఎస్ వై రహదారుల నిర్మాణం వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గొప్ప మానవతా దృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ వైకుంఠధామాలు గ్రామగ్రామాన నిర్మించారు. బతికినన్ని దినాలు కులాలు, మతాల పేరుతో కొట్టుకుంటున్నారు. ఆఖరుకు అంతిమ సంస్కారాలైనా ప్రశాంతంగా జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అని’ మంత్రి నిరంజన్ అన్నారు.

కానీ గ్రామాలలో వాటిని ఎవరూ అనుకున్నంతగా ఉపయోగించడం లేదు.. వాటి వినియోగంపై ప్రజలలో అవగాహన పెంచాలి. డంపింగ్ యార్డులను క్రమపద్దతిలో నిర్వహించాలి. పల్లెప్రకృతి వనాలను గ్రామాలలో అధ్భుతంగా నిర్మించారు. నరేగా, పల్లెప్రకృతి వనాలలో పంచాయతీరాజ్ శాఖ కృషి అభినందనీయమని మెచ్చుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో సీసీ రహదారులు, మురికికాలువల నిర్మాణం, కరంటు సమస్యలు, తాగునీటి సరఫరా ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి హైదరాాబాద్ జిల్లాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టాలి. అనంతరం దానిని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలి. పల్లె ప్రకృతి వనాలలో ఏర్పాటులో రాష్ట్రంలో వనపర్తి అగ్రభాగాన నిలిచింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద  ఎస్టీ గ్రామపంచాయతీలలో పంచాయతీ భవనాల నిర్మాణానికి అవకాశం ఇవ్వాలి. అని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.

గతంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని డ్రింకింగ్ వాటర్ కేటాయించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మన్నెం కొండ టెంపుల్ వద్ద వాటర్ టాంక్ కట్టాం. మిగతా నీళ్లు కింద చెరువుకు పోవాలి అన్నారు. ఇక్కడ ఈ మేరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గురించే చెప్పారు. అంటే, అందుకు తగ్గట్లుగా, నిధులు అధికంగా ఇవ్వండి అని కోరారు. అలాగే పెండింగ్ బిల్స్ ఉంటే వెంటనే క్లియర్ చేయాలి. సీఎం కేసీఆర్ ఆదేశించిన విధంగా... పనులు జరిగేట్లు అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు చెప్పే పనులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు కూచకుల్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పీవీ వాణి దేవి, ఎమ్మెల్యేలు చర్లకోల లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, మహేశ్వర రెడ్డి, చిట్టెం రామ్ మోహన్ రెడ్డి, అలా వెంకటేశ్వర రెడ్డి, అబ్రహం, పట్నం నరేందర్ రెడ్డి, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు కలిసి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్, పిఆర్ ఈఎన్‌సీ సంజీవ రావు, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, జిల్లాకు చెందిన ఆయా శాఖల ఎస్‌ఈలు, డీఆర్‌డీఓలు, డీపీఓలు తదితరులతో హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయం మీటింగ్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. 

Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఓ మోస్తరు వర్షాలు.. పెరుగుతున్న చలి తీవ్రత

Also Read: Gold-Silver Price: నేటి పసిడి, వెండి ధరల్లో ఊహించని పరిణామం.. ఇవాళ ధరలు ఇలా.. 

Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్‌ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్‌ కంపెనీకి నష్టాల సెగ!!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 11:43 AM (IST) Tags: telangana telangana news kcr TS News mahabubnagar news mahabubnagar Srinivas Goud Panchayath Raj Department Niranjan Redy

సంబంధిత కథనాలు

Podu Lands Issue : పోడు భూముల కోసం పోరుబాట, పట్టాల కోసం గిరిజనుల ఎదురుచూపులు

Podu Lands Issue : పోడు భూముల కోసం పోరుబాట, పట్టాల కోసం గిరిజనుల ఎదురుచూపులు

Karimnagar Cat Rescue : అర్థరాత్రి "పిల్లి" ప్రాణం కాపాడిన కరీంనగర్ పోలీసులు - ఈ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్

Karimnagar Cat Rescue :  అర్థరాత్రి

Breaking News Live Telugu Updates:  పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

Breaking News Live Telugu Updates:  పాడేరు ఘాట్ రోడ్డులో ప్రమాదం,15 మందికి గాయాలు

Nizamabad News : కొడుకు మోసం చేశాడని కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

Nizamabad News : కొడుకు మోసం చేశాడని కలెక్టరేట్ లో వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

Khairatabad Ganesh : ఈ సారి పర్యావరణ హిత ఖైరతాబాద్ గణేశ్ - 50 అడుగులకే పరిమితం !

Khairatabad Ganesh : ఈ సారి పర్యావరణ  హిత ఖైరతాబాద్ గణేశ్ -    50 అడుగులకే పరిమితం !

టాప్ స్టోరీస్

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు

Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు