అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Loksabha Elections 2024: ఆ మూడు పార్టీలకు రైతులే టార్గెట్! వాళ్ల చుట్టూనే తెలంగాణ రాజకీయం

General Elections 2024: రైతు సంబంధింత అంశాల చుట్టే అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తిరుగుతుండడం ప్రాధాన్య అంశంగా మారింది.

Telangana Politics: తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా విచిత్రంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపైన నడుస్తోంది. మోదీ మరో మారు ప్రధాని అని బీజేపీ.. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు లేదా మార్చేస్తారంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేపడుతోంది. ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు జాతీయ రాజకీయ అంశాలే ప్రాధాన్య అంశాలుగా  ప్రచారం చేస్తున్నారు. జాతీయ పార్టీలను పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారి ఎజెండా జాతీయ అంశాల చుట్టు పరిభ్రమిస్తుంటే... తెలంగాణలో మాత్రం స్థానిక అంశాలనే ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధాన ఎజెండాగా  ప్రచారం చేస్తున్నాయి. అందులోను రైతు సంబంధింత అంశాల చుట్టే అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు  తిరగడం విశేషంగా చెప్పాలి.
 
రైతు యాత్రలు నిర్వహించిన బీఆర్ఎస్
 
 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాభవం పొందిన బీఆర్ఎస్ తిరిగి తన బలం పెంచుకునే దిశగా మరో సారి అన్నదాతలనే నమ్ముకుంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువ స్థానాలు గెల్చుకున్న గులాబీ పార్టీని రూరల్ తెలంగాణలోని ఫలితాలు పెద్ద దెబ్బతీసాయి.   ఉమ్మడి ఖమ్మం, నల్గొండ,వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్దఎత్తున సీట్లు గెల్చుకుని మరో దఫా అధికారం చేపడతామని భావించిన  బీఆర్ఎస్ కు  ఆ జిల్లాల్లో ఘోర పరాభవం మిగిలింది.  మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే  కారు పార్టీ పరువు కాపాడాయి. దీంతో రూరల్ తెలంగాణపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ రైతు ఎజెండాను మరో సారి పైకి తీసారు.  ఈ క్రమంలోనే  పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావు రూరల్ తెలంగాణలో విస్తృతంగా ప్రర్యటించారు. రైతుల పొలం బాట పట్టి ఎండిన పంటలను పరిశీలించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక  సాగు నీరు ఇవ్వడం లేదని  బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మరో వైపు కేసీఆర్ సైతం నల్గొండ,  వంరగల్ జిల్లాల్లో ప్రత్యేకంగా రైతుల కోసం పర్యటన చేపట్టారు.  ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు . 2 లక్షల  రైతు రుణ మాఫీ పై రేవంత్ ప్రభుత్వాన్నినిలదీసారు.  200 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ జవాబుదారీ అంటూ నిప్పులు చెరిగారు.   రైతు బంధు కింద 15 వేల రూపాయల ఆర్థిక సాయం ,  ఎండిన పంలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా   రైతు  సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ , బీజేపీ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ ఎన్నికల రాజకీయాల్లో సాగుతోంది.
 
 రైతు దీక్షలతో కమలం పార్టీ దూకుడు...
వికసిత్ భారత్ కోసం మూడో సారి ప్రధానిగా మోదీని గెలిపించాలని దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే  తెలంగాణలో మాత్రం బీజేపీ రైతు అంశాల పైనే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లను లక్ష్యాంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. కరీంనగర్ లో ఎంపీ  బండి సంజయ్ ఇటీవలే ఒక రోజు రైతు దీక్ష చేపట్టారు.  హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  కిషన్ రెడ్డి దీక్ష నిర్వహించారు. రైతులకు సాగు నీరు ఇవ్వడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎకరాకు 25 వేల నష్ట పరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు  రూ. 500 బోనస్ ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా బీజేపీ  డిమాండ్ చేసింది. రైతు భరోసా కింద 15వేల ఆర్థిక సాయం చేయాలని, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ కమలం నేతలు దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఇలా బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను రైతు సమస్యలపై నిలదీయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ ను అమలు చేస్తున్నాయి.
 
రైతు హమీలపై కాంగ్రెస్ కౌంటర్..
 
దేశ మంతటా I.N.D.I.A కూటమని గెలిపించాలని, రాహుల్ ను ప్రధాని చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.  బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ప్రచారం చేస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లెవనెత్తుతోన్న రైతు హమీలపైనే దృష్టి పెట్టి కౌంటర్ చర్యలు చేపట్టింది.  రైతులకు నీరు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే,  తాము అధికారంలోకి వచ్చి మూడు నెలలే అవుతుందని, బీఆర్ఎస్ పాలనలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ కౌంటర్ ప్రచారం మొదలు పెట్టింది.  బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా 2 లక్షల రైతు రుణ మాఫీ హమీ పై కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నిన్న నారాయణ పేటలో జరిగిన సభలో  సీఎం రేవంత్ రెడ్డి  ఇచ్చిన ఆరు హమీల్లోని రెండు రైతు హమీలను  అమలు తేదీని ప్రకటించారు. ఆగష్టు 15వ తేదీ  లోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల  రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు.  వచ్చే సీజన్ నుండి ధాన్యానికి 500 రూపాయలు క్వింటాకు బోనస్ గా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. 
 
రానున్న రోజుల్లో ఎజెండా మారుతుందా..
 
ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు రైతు రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ గా  ఆగష్టు 15 లోపు మాఫీ ఉంటుందని చెప్పి ప్రతిపక్షాల నోరు మూసే ప్రయత్నం చేశారు. అయితే రానున్న రోజుల్లో సాగు నీరు విషయంలోను ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. పంటలు ఎండిపోవడం  కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే పరిణామం అనే చెప్పాలి. అయితే  ఎన్నికలు దగ్గవుతున్న కొద్ది రైతుల అంశమే ప్రధాన ఎన్నికల ప్రచారంశం అవుతుందా.. లేక జాతీయ అంశాలు తెరపైకి వస్తాయా అన్నది మాత్రం వేచిచూడాలి. అంతే కాకుండా ఈ మూడు పార్టీల్లో రైతు ఓటు బ్యాంకు కొల్లగొట్టే పార్టీ ఏదా అన్నది కూడా వేచి చూడాల్సిన విషయమే.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget