అన్వేషించండి

Telangana News: ఒక్కసారిగా పెరిగిన విద్యుత్ డిమాండ్- సాగుకు పగలు మాత్రమే కరెంటు

Telangana News: దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో.. సాగుకు రాత్రి వేళల్లో కరెంటు ఇవ్వకూడదని అన్ని రాష్ట్రాలకు సూచించింది. పగటి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని తెలిపింది. 

Telangana News: దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగిపోయింది. రాత్రిపూట కూడా భారీగా వినియోగం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల వ్యవసాయానికి పగటి వేళల్లో మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. రాత్రివేళల్లో అస్సలే పంట సాగు కోసం కరెంటు ఇవ్వకూడదని వివరించింది. పగటి వేళల్లో డిమాండ్ మరీ ఎక్కువ అయితే సౌర, పవన విద్యుత్ తో తీర్చవచ్చని స్పష్టం చేసింది. ఈనెల ఒకటవ తేదీన పగటి పూట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 241 గిగావాట్లకు పెరిగిపోయినా తీర్చడం సాధ్యం అయిందని పేర్కొంది. దేశంలో కేవలం 0.1 శాతమే విద్యుత్ కొరత ఉందని తెలిపింది. కొంతకాలం నుంచి సూర్యాస్తమయం తర్వాతి వేళల్లోనూ భారీగా విద్యుత్ డిమాండ్ ఉంటోందని.. ఈనెల ఒకటవ తేదీన ఈ సమయంలో రికార్డు స్థాయిలో 218.4 గిగావాట్ల డిమాండ్ నమోదు అయిందని వెల్లడించింది. సౌర విద్యుత్ లభ్యత లేకపోవడంతో రాత్రిపూట కొరత ఏర్పడుతోందని అందువల్లే విద్యుత్ సరఫరాను పగటి వేళకే పరిమితం చేయాలని సూచించింది. ఈ మేరకు భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ ను తీర్చడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ... కేంద్ర విద్యుత్ శాఖ ఈనెల 5వ తేదీన అన్ని రాష్ట్రాలకు లేఖ రాసంది.

దేశంలో ఆగస్టు నెలలో 23 శాతం డిమాండ్ పెరిగినా తీర్చగలగడం ప్రపంచ స్థాయిలో రికార్డు. ఈ నెలలో వారం రోజుల పాటు రోజు వారీగా 5 బిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరిగింది. 16 రోజుల పాటు రోజువారీ గరిష్ట డిమాండ్ 200 గిగా వాట్లకు పైనే రికార్డు అయింది. కొన్ని రాష్ట్రాలు డిమాండ్ ను తీర్చలేకపోయాయి. ఆగస్టులో రాత్రి వేళల్లో డిమాండ్ తో పోల్చితే సరఫరాలో 10 గిగావాట్ల లోటు ఏర్పడింది. 700 మిల్లీ యూనిట్ల కొరత ఏర్పడగా... రోజువారీగా 6 నుంచి 9 గిగావాట్ల కొరత నెలకొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి జరపాలని కేంద్రం ఆదేశించడంతో 30 నుంచి 32 గిగావాట్ల విద్యుత్ లభ్యత పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే విద్యుత్ కొరత ఎక్కువగా ఉండడం గమనార్హం. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రిజర్వాయర్లలో నిల్వలు అడుగంటిపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది ఇదే కాలంలో 45 గిగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరగగా... ఈసారి 40 గిగా వాట్లలోపే ఉండడం గమనార్హం. జూన్, సెప్టెంబర్ మధ్య పవన విద్యుదుత్పత్తి అధికంగా జరగాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది తగ్గిపోయింది. 43.9 గిగావాట్ల పవన విద్యుత్ కేంద్రాలు ఉండగా. 2 నుంచి 3 గిగావాట్ల ఉత్పత్తి మాత్రమే ఉంటోంది. 25 గిగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఉండగా... గ్యాస్ కొరతతో 8.7 గిగావాట్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. 

విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కేంద్రం సూచనలు ఇవే..!

విద్యుత్ కేంద్రాల్లో జరుగుతున్న మరమ్మతులను సత్వరంగా పూర్తి చేసి ఉత్పత్తిని పునరుద్ధరించాలని తెలిపింది. అలాగే షెడ్యూల్ ప్రకారం విద్యుత్ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతులను డిమాండ్ తక్కువగా ఉండే కాలానికి వాయిదా వేసుకోవాలని పేర్కొంది. ఏదైనా కారణాలతో ఉత్పత్తి నిలిచిపోయిన విద్యుత్ కేంద్రాల్లో సత్వరంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. అన్ని రకాల విడి భాగాలను ముందుగానే సమీకరించి పెట్టుకోవాలని స్పష్టం చేసింది. ఖాళీ, నాణ్యత లేని బొగ్గు, యాష్ పండ్, ఇతర చిన్న సమస్యలతో చాలా కేంద్రాల్లో పూర్తి సామర్థ్యం ఉత్పత్తి జరిగేలా చూడాలనని సూచించింది. ఈనెల ఒకటవ తేదీన జారీ చేసిన అడ్వైజరీ మేరకు అన్ని రాష్ట్రాల జెన్ కోలు విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం కింద తీసుకోవాల్సిన విద్యుత్ ను ఏదైనా రాష్ట్రం వదులుకుంటే... ఆ విద్యుత్ ను పవర్ ఎక్స్చేంజీల్లో ఇతర రాష్ట్రాల కోసం అందుబాటులో ఉంచాలని పేర్కొంది. డిమాంండ్ ఎక్కువగా ఉండే వేళల్లో, ముఖ్యంగా రాత్రి సమయాల్లో గ్యాస్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తి జరిగేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి. నిర్మాణంలోని థర్మల్, సౌర, పవన విద్యుత్ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget