అన్వేషించండి

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసుల వద్ద తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. ఫ్రీడం ర్యాలీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

Srinivas Goud Firing :  తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు.. యువకులు పాల్గొన్న ర్యాలీ కొనసాగుతున్న సమయంలో హఠాత్తుగా పోలీసుల వద్ద నుంచి ఎస్‌ఎల్ఆర్ తుపాకీని తీసుకున్నారు. గాల్లోకి గురి పెట్టి కాల్పులు జరిపారు. ఒక్క సారిగా తూటాల శబ్దం వచ్చే సరికి ఆ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత మంత్రిగారే గాల్లోకి కాల్పులు జరిపారని తేలింది. మంత్రి గాల్లోకి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

ఫ్రీడం ర్యాలీలో  తుపాకీ కాల్పులు 

మంత్రి అయినంత మాత్రాన ఆయనకు గాల్లోకి కాల్పులు జరిపే అధికారం ఉండదు. అలా కాల్పులు జరపడం చట్టపరంగా నేరం. అదే సమయంలో అది పోలీసులు అధికారికంగా వినియోగించాల్సిన తుపాకీ. ఏ పోలీసు ఉద్యోగికి అయితే దాన్ని కేటాయించారో..పూర్తిగా ఆ తుపాకీ, బుల్లెట్ల బాధ్యత ఆయనదే. ఇప్పుడు ఏ పోలీసు అధికారి దగ్గర శ్రీనివాస్ గౌడ్ తుపాకీ తీసుకున్నారో ఆయనది కూడా తప్పయ్యే అవకాశం ఉంది.

పోలీస్ వద్ద ఎస్ఎస్ఆర్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఫ్రీడం ర్యాలీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే తుపాకులతో కవాతులు నిర్వహించాలని ఎక్కడా లేదు. మహబూబ్ నగర్‌లోనూ ఇలా పోలీసులు తుపాకులతో కవాతులు నిర్వహించలేదు. కానీ మంత్రి గారు పాల్గొంటున్నారన్న ఉద్దేశంతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు కార్యక్రమం కోసం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన వారిలో తన పక్కన ఉన్న పోలీసు అధికారి నుంచి ఎస్ఎల్ఆర్ వెపన్‌ను తీసుకున్న శ్రీనివాస్ గౌడ్ ఊహించని విధంగా కాల్పులు జరిపేశారు. 

మంత్రి తీరుపై తీవ్ర విమర్శలు

పోలీసులు వెపన్‌ను మంత్రికి అయినా సరే ఇవ్వకూడదు. ఇంకా ముఖ్యంగా వెపన్‌ను లాక్ చేసుకుని ఉంటారు. కానీ మంత్రి అడగగానే పోలీసు అధికారి తన ఎస్ఎల్ఆర్ వెపన్‌ను ఇచ్చేయడమే కుండా.. ఫైరింగ్‌కు అనుకూలంగా ఉండేలా మార్చి ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. తప్పు గన్ ఇచ్చిన పోలీసు అధికారిదే ఎక్కువ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

తీవ్ర విమర్శలు చేస్తున్న నెటిజన్లు

శ్రీనివాస్ గౌడ్ కాల్పులు జరుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంచలనంగా మారింది. ఎంత మంత్రి అయితే మాత్రం ఇలా గాల్లోకి కాల్పులు జరుపుతారా అని ప్రశ్నిస్తున్నారు. తక్షణం మంత్రిపై చర్యలు తీసుకోవాలని... గన్ ఇచ్చిన పోలీసుల అధికారిపైనా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. సాధారణంగా పెళ్లి బారాత్‌లలో కొంత మంది ఇలా గాల్లోకి లైసెన్స్‌డ్ తుపాకులతో కాల్పులు జరిపినా తీవ్రమైన కేసులు పెడతారు. ఇప్పుడు మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

రబ్బర్ బుల్లెట్లు కాల్చానన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

తనకు ఎస్పీనే తుపాకీ ఇచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  తాను రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినన్నారు. తాను గాల్లోకి కాల్చింది రబ్బర్ బుల్లెట్లేనని ఇందులో వివాదమేదీ లేదని శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget