News
News
వీడియోలు ఆటలు
X

నోటీసుల కంటే ముందే ఫోన్ల గురించి ఎలా మాట్లాడుతారు?- మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈడీకి కవిత రాసిన లేఖపై కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్లు కొట్లాడారో కిషన్ రెడ్డికి తెలియదా అని అన్నారు.

FOLLOW US: 
Share:

ఏ ఆధారం లేకుండా ముందే ఉంహించి, నోటీసుల కంటే ముందే నవంబర్‌లోనే కవితను సెల్ ఫోన్లు ఉన్నాయా లేవా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎలా మాట్లాడారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌ గౌడ్ ఎమోషనలయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డనుపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు! ఫోన్లన్ని భద్రంగా ఉన్నాయని గతంలో కవిత స్పష్టం చేశారని శ్రీనివాస్‌ గౌడ్ గుర్తుచేశారు. ఈడీకి కవిత రాసిన లేఖపై కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాని మెడికల్ కాలేజీ వచ్చిందని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్లు కొట్లాడారో కిషన్ రెడ్డికి తెలియదా అని అన్నారు.

ఒక అడబిడ్డపై ప్రతాపమా..?

“ఒకరిమీద మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఒక ఆడబిడ్డ ప్రతిష్ఠకు భంగం కలిగించారు. అసభ్యకరంగా మాట్లాడారు. ముందే ఈ అంశంపై ఢిల్లీలో ఇద్దరు బిజెపి ఎంపీలు ఎలా మాట్లాడుతారు. దేశ ప్రజలారా ఆలోచించండి. ఫోన్లు ఉన్నాయా, ఏమయ్యాయి అని సమాచారం అడగలేదు. కోట్ల విలువగల ఫోన్లు ధ్వంసం అయ్యాయని కిషన్ రెడ్డి ఎలా మాట్లాడారు? ఉద్దేశపూర్వకంగా KCRను ఎదుర్కోలేక ఇలా వేధిస్తున్నారు. దేశంలో యువత, మేధావులు, నాయకులు ఆలోచన చేయాలి. ఒక అడబిడ్డపైన మీ ప్రతాపమా? రూ. 100 కోట్లకే పెద్ధ స్కామ్ అయితే... మీ నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, ఆదానివి ఎన్ని లక్షల కోట్లు ఆవిరై పోయాయి. చోక్సీ భాయి చోక్సీ భాయి అని మాట్లాడారు. చోక్సీ భాయి ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించుకుంటూ... రెడ్ కార్పెట్ వేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులను వదిలేశారు. దేశ సంపద దోచుకొని యూకే లో జల్సాలు చేస్తున్నారు. దోస్తులను వదిలేసి... తెలంగాణ బిడ్డను ఇబ్బందులకు గురిచేస్తున్నారు”- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కొన్నిటీవీ చానెళ్లవి పైశాచికం ఆనందం

“ఎప్పుడు పిలిచినా ఎమ్మెల్సీ కవిత వచ్చారు. ఊరికే గంటలు గంటలు కూర్చోబెట్టారు. 10 నెలలుగా ఆడబిడ్డను వేధిస్తున్నారు. కొన్ని టీవీ చానెళ్ల పైశాచికం ఆనందం ఏంటి? నాలుగో స్థంభంగా ఉన్న మీడియా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఉన్నవి లేనట్టు... లేనివి ఉన్నట్టు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్‌లో ఒక్క నోటీసైనా ఇచ్చారా? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావ్ కిషన్ రెడ్డి. ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. దేశం లూటీ చేసినోళ్ళను వదిలేస్తున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఆడబిడ్డను పండుగ అని లేకుండా హింసిస్తున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ మాదిరి పరిపాలన మీ బిజెపి పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఉందా చెప్పగలరా?”- శ్రీనివాస్‌గౌడ్

ప్రశ్నించే గొంతులను పిసికేస్తున్నారు

“కేసులున్న వారు బీజేపీలో చేరితే అయితే గంగలో మునిగినట్టా? బీజేపీలో చేరితే పాపాలు పోతాయా? మీకు చేతనైతే తెలంగాణకు మేలు చేయండి. ఈరకంగా వ్యవహారం నడపడం దేశానికి మంచిది కాదు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే ఉరుకోం. తెలంగాణ గడ్డ ఇది. దేశాన్ని దోచుకునే వాళ్ళను ఢిల్లీ గడ్డపై ఉరితీయండి. దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బెదిరింపులకు భయపడేది లేదు. తెలంగాణ, దేశం అంటే కేసీఆర్‌కు ప్రాణం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మీకు చేతనైతే అవి అమలు చేయండి. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని చెప్పిందే కేంద్ర ప్రభుత్వం. తెలంగాణబిడ్డ సింహంలా గర్జిస్తుంది. రాణి రుద్రమ , చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డపై పుట్టిన పులి బిడ్డ ఎమ్మెల్సీ కవిత” -శ్రీనివాస్‌గౌడ్

Published at : 21 Mar 2023 02:59 PM (IST) Tags: BJP Kishan Reddy MLC ED Kavitha Srinivas Goud BRS Telangana

సంబంధిత కథనాలు

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Dr.BRAOU BEd Exam: అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Diversion: జూన్ 4న ఐకియా ఫ్లై ఓవర్ మూసివేత సహా హైద‌రాబాద్‌ లో ఆ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

Sharmila On KCR : సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు

TSPSC News : తవ్వకొద్దీ అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

TSPSC News :  తవ్వకొద్దీ  అక్రమాలు - టీఎస్‌పీఎస్సీ కేసులో ఇంకెన్ని అరెస్టులు ?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?