KTR: తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటుచేయండి ... కేంద్రానికి మంత్రి కేటీఆర్ మరో లేఖ

చేనేత, జౌళి రంగాల్లో తెలంగాణకు సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. కాకతీయ టెక్స్ టైల్ పార్కు, సిరిసిల్ల పవర్ లూమ్ క్లస్టర్ లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

FOLLOW US: 

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. చేనేత, జౌళి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరుతూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయెల్‌లకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఇదే అంశంపై మంత్రి గతంలో పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. 

Also Read: మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ తీసుకురండి.. బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ కోసం నిధులు

వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి  రూ 897.92 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు ప్రాజెక్టుకు అనుమతి త్వరగా ఇవ్వాలని లేఖలో పేర్కొ్న్నారు. కాకతీయ మెగా పార్క్ వంటి భారీ ప్రాజెక్ట్‌లు సముచితంగా లబ్ది పొందేందుకు వీలుగా 'టెక్స్‌టైల్ అపెరల్ సెక్టార్ తయారీ ప్రాంతాల అభివృద్ధి (MRTA)' విధానాన్ని ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో 1200 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్‌ అయిన  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను అభివృద్ధి చేస్తుంది. ‘ఫైబర్ టు ఫ్యాషన్’ కాన్సెప్ట్ ఆధారంగా, అత్యాధునిక  సౌకర్యాలతో  కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నట్టు కేటీఆర్ చెప్పారు.

సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ 

 సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేయాలని, ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ 993.65 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం  రూ. 49.84 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు.  సిరిసిల్లలోని టెక్స్‌టైల్ పార్క్, చేనేత, అపెరల్ పార్క్ ల నిర్వహణ, ఆధునీకరణ ఉత్పత్తి స్థావరాన్ని విస్తరించడం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధికి కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలని లేఖలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఉపాధి అవకాశాలు పెంపొందిపచేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్లలో వర్కర్ టు ఎంటర్‌ప్రెన్యూర్ స్కీమ్, అపెరల్ పార్క్, వీవింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.  సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు పార్క్‌లో సీఎఫ్‌సీని పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మొత్తం వ్యయంలో తెలంగాణ ప్రభుత్వ వాటా మొత్తం  రూ.756.97 కోట్లని మంత్రి స్పష్టం చేశారు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 

తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (I.I.H.T)ని ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  లో వెంకటగిరిలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో భాగమైందన్నారు.  ప్రస్తుతం తెలంగాణలో హండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులను అందించే సంస్థ ఏదీ లేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించడానికి కావాల్సిన వసతులన్ని ఉన్నాయని, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలోని హ్యాండ్‌లూమ్ పార్క్‌లో భవన సదుపాయంతో  పాటు తగినంత స్థలం కూడా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.

Also Read: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య, ఆమె తెలివికి శభాష్ అంటున్న స్థానికులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Jan 2022 10:24 PM (IST) Tags: minister ktr TS News kakateeya mega texitle park sirisilla powerloom cluster

సంబంధిత కథనాలు

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

MLC Kavitha: జూన్‌ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: జూన్‌ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత

Karimnagar News : ప్రభుత్వం ఓకే చెప్పింది ..కానీ భూమి ఏది ? క్రీడా మైదానాల కోసం ఎన్ని కష్టాలో

Karimnagar News  :  ప్రభుత్వం ఓకే చెప్పింది ..కానీ  భూమి ఏది ? క్రీడా మైదానాల కోసం ఎన్ని కష్టాలో

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!