KTR: మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి.. బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్
సిరిసిల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ సహా ఇతర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు భారీగా ఉండేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ బీజేపీ నేతలకు డిమాండ్ చేశారు కేటీఆర్. లేకుంటే విమర్శలు మానుకోవాలని ప్రజలకు క్షమాపణ చేప్పాలని సూచించారు.
కోవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు, మన ఊరు - మన బడి కార్యక్రమం, దళితబంధు పథకం, తదితర అంశాలపై రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ @KTRTRS గారు@TelanganaCMO @IPRTelangana pic.twitter.com/Q5TY1VKzfJ
— CollRajannaSircilla (@Collector_RSL) January 21, 2022
తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి కేంద్రం ప్రవేశపెట్టిన ఏడు బడ్జెట్టులలో ఇక్కడి నేతన్నలను పట్టించుకున్నది ఏమీలేదన్నారన్నారు. ప్రతి బడ్జెట్‌లోనూ అన్యాయమే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్టులను పట్టుకున్న పరిస్థితి లేదని ఇప్పటికైనా వాటికి మోక్షం కల్పించాలని కేటిఆర్ అభిప్రాయపడ్డారు. దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతున్నారని ప్రశ్నించారు.
వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు నిధులు తీసుకురావాలని బండి సంజయ్‌కు సవాల్ చేశారు కేటీఆర్. రూ. 897 కోట్ల 90 లక్షలు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
పోచంపల్లి కేంద్రంగా హ్యాండ్ లూమ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు బాధ్యత తీసుకోవాలని బండికి సూచించారు కేటీఆర్. లూమ్ అప్ గ్రేడేషన్ పథకానికి కేంద్రం సహాయం చేయాలని. టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో కొత్తగా పదకొండు చేనేత సమూహాలను బండి సంజయ్ మంజూరు చేయాలని కోరారు.
మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను బండి సంజయ్ మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇది మంజూరు చేయకపోతే నేతన్నలను ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సిరిసిల్ల జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు కావలసిన ఏర్పాట్లు చేశామన్నారు కేటీఆర్. కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కష్టకాలములో అవసరమైతే కావలసిన సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు స్థానిక అధికారులకు కల్పించామని చెప్పారు.
టీనేజ్ వాళ్లకు వాక్సినేషనులో జిల్లా ఐదవ స్థానములో ఉందని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. జిల్లాలో 479 వైద్య బృందాలు లక్షా యాభై వేల ఇళ్లల్లో చేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో హెల్త్ ప్రొఫైల్ స్కీమ్ త్వరలోనే పట్టలెక్కనుందని కేటీఆర్ ప్రకటించారు. దీనికి సిరిసిల్ల జిల్లా పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైందని వివరించారు. ఫిబ్రవరిలో మొదటి వారంలో దీనికి సంబంధించిన పనులు ప్రారంభిమవుతాయని వెల్లడించారు.
జిల్లాలోని పదమూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో మొదటి విడత దళిత బంధు లబ్దిదారుల ఎంపిక ప్రారంభిస్తామని ప్రకటించారు కేటీఆర్. జిల్లాలో మనఊరు మనబడిలో భాగంగా 510 బడులను మూడేళ్లలో ఆధునీకరిస్తామని తెలిపారు.
Also Read: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్