Konda Surekha: ఎంజీఎం ప్రక్షాళనపై ఫోకస్, అధికారులకు మంత్రి కొండా సురేఖ కీలక ఆదేశాలు
Konda Surekha Telugu News: ఉత్తర తెలంగాణ పెద్ద హాస్పిటల్ అయిన వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని మంత్రి కొండా సురేఖ ఆదివారం సందర్శించారు.
MGM Hospital in Hanmakonda: హన్మకొండ: పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఎంజీఎం పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని వైద్య అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఉత్తర తెలంగాణ పెద్ద హాస్పిటల్ అయిన వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని మంత్రి కొండా సురేఖ (Telangana Minister Konda Surekha) ఆదివారం సందర్శించారు. అనంతరం ఎంజీఎం అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరగడం, రెండు రోజుల కిందట రెండు గంటల పాటు కరెంట్ పోయి రోగులు ఇబ్బందులు పడ్డ సంఘటన పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి సంబంధించిన వివిధ అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెల్త్ సిటీ పేరుతో కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి పై ఎంజిఎం (MGM Hospital) అధికారులకు ఎలాంటి ప్రమేయం లేకుంటేనే నిర్మాణం జరుగుతుందని అధికారులతో మంత్రి కొండా సురేఖ అన్నారు.
పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆపరేషన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వం ఇచ్చిన జీతాలు సరిపోవడం లేదంట్లుగా వ్యవహరిస్తున్నారని.. వారికికి కావాల్సింది డబ్బు మాత్రమే కాదన్నారు. అలాగైతే, యాక్ట్ తీసుకువచ్చి పీజీ పూర్తి చేసిన వారిని రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఆసుపత్రి ఎలా ఉందో తనకు సంబంధం లేదని ఇప్పటినుండి ఆసుపత్రిలో ప్రతి పేషెంట్‌కు వైద్యం అందించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని మంత్రి కొండా సురేఖ వైద్యశాఖ అధికారులను హెచ్చరించారు. ఎంజీఎం లో కావాల్సిన సౌకర్యాలపై త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశం అవుతానని సురేఖ అన్నారు.
సీతక్కతో కలిసి ఘనంగా జాతరలు నిర్వహణ..
హన్మకొండ: సమ్మక్క సారలమ్మ జాతర సహా సంక్రాంతికి ఐనవోలు, కొమురవెల్లి జాతరల్ని రాష్ట్ర మంత్రులుగా తాను, సీతక్క (Minister Seetakka) కలిసి ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఏమో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతరల నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాల నిర్వహణ సమీక్ష సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
Also Read: Hyderabad Cab Booking: క్యాబ్ డ్రైవర్స్ మీ రైడ్ క్యాన్సిల్ చేస్తే ఈ నంబర్‌కు ఇలా కంప్లైంట్ చేయండి - పోలీసులు