అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyderabad Police Warning: న్యూ ఇయర్ జోష్‌లో ఇవి మర్చిపోవద్దు- సెక్షన్స్‌తో సహా శిక్షలు చెప్పి పోలీసుల వార్నింగ్

Drunk and Drive Tests in Hyderabad: డిసెంబర్ 31న రాత్రి పదిగంటలు దాటితే అటువైపు వెళ్లొద్దంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.పరిమితులు, ఆంక్షలు విధించారు. మార్గదర్శకాలు జారీ చేశారు.

Hyderabad Drunk and Drive Tests: డిసెంబర్ 31 రాత్రి పదిగంటలు దాటితే అటువైపు వెళ్లొద్దంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. నూతన సంవత్సర వేడుకల (Happy New Year 2024) సందర్భంగా పరిమితులు, ఆంక్షలు విధించారు. మార్గదర్శకాలు జారీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొన్ని రోడ్డు మార్గాలను మూసివేశారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు. PVNR ఎక్స్‌ప్రెస్ వే రాత్రి రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలను అనుమతించారు. వాటితోపాటు కింద పేర్కొన్న నగరంలోని మరికొన్ని ఫ్లై ఓవర్‌లు రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు పూర్తిగా మూసివేసి ఉంటాయి.

అవి.. 1. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, 2. గచ్చిబౌలి ఫ్లైఓవర్, 3. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1 & 2), 4. షేక్ పేట్ ఫ్లైఓవర్, 5. మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, 6. రోడ్ నెం.45 ఫ్లైఓవర్ మరియు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, 7. సైబర్ టవర్ ఫ్లైఓవర్  8. ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, 9. ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, 10. బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్).  
ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

అలాగే క్యాబ్‌లు/టాక్సీ/ఆటో రిక్షా ఆపరేటర్లు ఈ నిబంధనలు పాటించాలి..
క్యాబ్‌లు/టాక్సీ/ఆటో రిక్షాల డ్రైవర్లు/ఆపరేటర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించడంతోపాటు  వారి అన్ని డాక్యూమెంట్స్ వెంట ఉంచుకోవాలి. క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితులలోను రైడ్ నిరాకరించకూడదు. ఇది మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన కిందకి వస్తుంది. రైడ్ నిరాకరించి క్యాన్సల్ చేసి ఉల్లంఘించిన వారికి రూ. 500/- జరిమానా విధించనున్నారు. ఎవరైనా ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడితే బండి నెంబర్, సమయం, ప్రదేశం మొదలైన వివరాలతో వాట్సాప్ 9490617346 కు ఫిర్యాదు చేయవచ్చు. ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు లేదా అదనపు ఛార్జీలు డిమాండ్ చేయకూడదు.


బార్/పబ్/క్లబ్ వంటి సంస్థలకు పోలీసుల కీలక సూచనలు
ఈ సంస్థలు తమ ప్రాంగణంలో మద్యం సేవించిన కస్టమర్‌లు వాహనాలు నడపడానికి అనుమతిస్తే, నేరాన్ని ప్రోత్సహించినందుకు సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. వారు తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే దుష్పరిణామాలపై తమ కస్టమర్‌లు  ఖచ్చితంగా అవగాహన కల్పించాలి. మద్యం సేవించిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి. మద్యం తాగిన వ్యక్తులు తమ ప్రాంగణంలో వాహనం నడపకుండా ఆపాలి. 

వీటితోపాటు నగరంలో సాధారణ ప్రజలకు నేరాలను నిరోధిండంలో భాగంగా పలు  సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు అమర్చారు. అలాంటి వారిని ఈ కెమెరాల ద్వారా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ & డ్రైవింగ్‌పై విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు. సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీస్ వారు వారి కస్టడీలోకి తీసుకుంటారు. చట్ట ప్రకారం పబ్లిక్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించడంతో పాటు పత్రాలను చూపించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.

చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, లేదా మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు వాహన యజమాని, డ్రైవర్ ఇద్దరూ న్యాయస్థానంలో విచారణకు హాజరుకావాలి.
వాహనాలలో అధిక-డెసిబెల్ మ్యూజిక్ సిస్టమ్‌లను ఉపయోగించడం నిషేధించారు. ఒకవేళ అలా చేస్తే తదుపరి చర్యల కోసం వాహనాలను సీజ్ చేసి ఆర్టీవో కార్యాలయానికి అప్పగిస్తారు. నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే, ఆ వాహనాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటారు. వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

ట్రాఫిక్ పోలీసులు ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రిపుల్/మల్టిపుల్ రైడింగ్ మొదలైన వాటిపై కేసులు నమోదు చేయనున్నారు. పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా, బాధ్యతతో మరియు సురక్షితంగా ప్రయాణించాలి.

మద్యం తాగి వాహనం నడపితే ఇబ్బందులు తప్పవని మందుబాబులను పోలీసులు హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపే ప్రతి ఒక్కరిపై  మోటార్ వెహికల్స్ యాక్ట్, 1988లోని u/s 185 డిడి కేసులు బుక్ చేసి, కోర్టులో హాజరుపరుస్తారు. మొదటి నేరానికి జరిమానా రూ. 10,000 లేదా  6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. రెండోసారి లేక అంతకంటే ఎక్కువసార్లు నేరానికి పాల్పడితే  రూ. 15000 లేదా  2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు.

మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 19 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను స్వాధీనం చేసుకుని సంబంధిత RTOలకు అప్పగిస్తారు. మొదటి నేరానికి డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రెండోసారి లేక అంతకంటే ఎక్కువ సార్లు ఈ నేరానికి పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్  శాశ్వతంగా రద్దు అవుతుంది. ఆ వ్యక్తి భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు. 

మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా ఎవరైనా రోడ్డు ప్రమాదానికి పాల్పడి, వ్యక్తి మరణానికి కారణమైనట్లయితే, ఐపీసీలోని U/s 304 పార్ట్-II (Culpable homicide not amounting to murder) క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని మందుబాబులను పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget