అన్వేషించండి

Telangana Loksabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ఉఫ ఎన్నిక కూడా, ముఖ్యమైన తేదీలివే!

Telangana News: ఏపీలో 25, తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఒకే రోజున ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే, తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికీ ఎన్నిక జరగనుంది.

Telangana Loksabha Election Schedule 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. దేశంలో మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందగా.. ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆ స్థానానికి మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువరిస్తారు. ఏపీ, తెలంగాణలో నాలుగో విడతలో భాగంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. లోక్ సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్ సభ ఎన్నికల పోలింగ్ (మే 13) జరగనుండగా.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలివే

☛ ఎన్నికల నోటిఫికేషన్ - ఏప్రిల్ 18

☛ నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ - ఏప్రిల్ 25

☛ నామినేషన్ల పరిశీలన - ఏప్రిల్ 26

☛ ఉపసంహరణకు ఆఖరు తేదీ - ఏప్రిల్ 29

☛ పోలింగ్ తేదీ - మే 13

☛ ఎన్నికల కౌంటింగ్ - జూన్ 4న ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.
Telangana Loksabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ఉఫ ఎన్నిక కూడా, ముఖ్యమైన తేదీలివే!
Telangana Loksabha Elections 2024: తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల - ఉఫ ఎన్నిక కూడా, ముఖ్యమైన తేదీలివే!

ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇదే!

దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో నాలుగో విడతలో అసెంబ్లీకి, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 18న ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. 26న నామినేషన్ల పరిశీలించనున్నారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు ఛాన్స్ ఇచ్చారు. మే 13న ఎన్నికలు నిర్వహించి, జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ముఖ్యమైన తేదీలివే

ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ - ఏప్రిల్ 18
నామినేషన్లు ప్రారంభం  - ఏప్రిల్ 18
నామినేషన్లు తుది గడువు - ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన  -  ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణ - ఏప్రిల్ 29
ఏపీలో ఎన్నికలు - మే 13
ఓట్ల లెక్కింపు - జూన్ 4

అటు, దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు నమోదు చేసుకున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటింగ్ కోసం దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే అధికం. దాదాపు కోటిన్నర మంది అధికారులు ఎన్నికల ప్రక్రియలో భాగం కానున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేస్తామని వివరించారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటు (Vote From Home) అవకాశం కల్పిస్తామన్నారు. 'బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్ ఉంటుంది. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ.3,400 కోట్లు సీజ్ చేశాం. సోషల్ మీడియా పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారులను నియమిస్తాం. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్లను వాడుతాం. ఎవరైనా హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తాం. రెండోసారి ఓటు వేయడానికి కేసు బుక్ చేస్తాం.' అని స్పష్టం చేశారు.

Also Read: Cantonment Byelection : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకూ షెడ్యూల్ - తానే పోటీ చేస్తానన్న లాస్య నందిత సోదరి !

టాప్ హెడ్ లైన్స్

KTR Complaints to Rahul Gandhi: రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
రేవంత్‌పై రాహుల్‌కు కేటీఆర్ వరుస ఫిర్యాదులు - చర్యలు తీసుకోరని తెలిసీ బిఆర్ఎస్ వేస్తున్న మైండ్ గేమ్ ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Congress MLA Viral Video: చేయి పట్టుకుని, నడుము టచ్ చేసి.. విద్యార్థినితో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై దుమారం!
చేయి పట్టుకుని, నడుము టచ్ చేసి.. విద్యార్థినితో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై దుమారం!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Embed widget