అన్వేషించండి

Covid Updates: తెలంగాణలో కొత్తగా 2,098 కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2,098 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 74,803 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,098 మందికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,76,313కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,099కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 29,226 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 3,801 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,42,988కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,25,37,941 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

ఏపీలో కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 78,746 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 3,396 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 9 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,655కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో  13,005 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,07,364 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 78,746 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,00,765కి చేరింది. గడిచిన 24 గంటల్లో 13,005 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 78,746 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,655కు చేరింది. 

దేశంలో కరోనా కేసులు

 భారత్​లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,27,952 (1 లక్షా 27 వేల 952) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ మరో వెయ్యి మంది మరణించారు. వరుసగా అయిదోరోజు కరోనా మరణాలు వెయ్యి దాటడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం ఒక్కరోజు దేశంలో 1059 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది. తాజా మరణాలతో కలిపితే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 5,01,114 (5 లక్షల 1 వెయ్యి 114)కు చేరింది. నిన్న ఒక్కరోజులో 2,30,814 (2 లక్షల 30 వేల 814) మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 13,31,648 (13 లక్షల 31 వేల 648) మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు రేటు 7.98కి దిగొచ్చింది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget