By: ABP Desam | Updated at : 04 Feb 2022 08:30 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తెలంగాణలో కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 79,561 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,387 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,74,215కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,097కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 30,931 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 4,559 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,39,187కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,24,63,138 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 30,886 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 4,198 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 5గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,646కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 9,317 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,94,369 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 88,364 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,317 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 88,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,646కు చేరింది.
దేశంలో కరోనా కేసులు
24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1, 49, 394 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య పదమూడు శాతం తగ్గింది. ఇరవై నాలుగు గంటల్లో 1.072 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. 2, 46, 674 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా వెలుగు చూసిన కేసులతో కలిసి దేశవ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పటి వరకు డెత్ టోల్ 5,00,055లుగా ఉంది. రోజూవారిగా ఉండే పాజిటివిటీ రేటు 9.27శాతం ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 12.03 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా నిన్న 16,11,666 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 168.47కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో గత 24 గంటల్లో 1,956 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో క్రియాశీల కేస్‌లు 15,632. మిజోరంలో రోజువారీ పాజిటివిటీ రేటు 30.91%కి చేరుకుంది. మహారాష్ట్రలో 15,252 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. 75 మరణించారు. తమిళనాడులో 11,993 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33,87,322కి చేరుకుంది. 30 మరణాలతో మొత్తం మృతులు సంఖ్య 37,666కి చేరుకుంది. కేరళలో గురువారం కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. 42,677 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 61,72,432కి చేరుకుంది.
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు