Covid Updates: తెలంగాణలో తగ్గిన కోవిడ్ కేసులు... కొత్తగా 2,484 కేసులు, ఒకరు మృతి
తెలంగాణలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2,484 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మరణించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 65,263 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2,484 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,61,050కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,086కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 38,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 4,207 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,18,241కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,20,38,448 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,296 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 10,310 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 12 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,606కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 9,692 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,39,854 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,16,031 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,70,491కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,692 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,606కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,24,45,428 శాంపిల్స్ పరీక్షించారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదుకాగా 893 మంది మృతి చెందారు. తాజాగా 3,52,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- యాక్టివ్ కేసులు: 18,84,937(4.59%)
- డైలీ పాజిటివిటీ రేటు: 14.50%
- మొత్తం వ్యాక్సినేషన్: 1,65,70,60,692
వ్యాక్సినేషన్
భారత్లో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది. దేశంలో 75 శాతానికి పైగా అర్హులైన వారికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అయినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. మహారాష్ట్రలో కొత్తగా 27,971 మంది కరోనా సోకింది. 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 61 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,83,525కు చేరింది. మరణాల సంఖ్య 1,42,522కు పెరిగింది. మరణాల రేటు 1.85గా ఉంది. కొత్తగా నమోదైన 85 ఒమిక్రాన్ కేసుల్లో 44 పుణె, 39 ముంబయిలో నమోదయ్యాయి.