Telangana Elections: ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు, తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
Telangana Elections: ఈ నెల 30న తెలంగాణ ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ఈ మేరకు కార్మికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Elections: ఈ నెల 30వ తేదీన తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఆ రోజున ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు దినంగా సర్కార్ ప్రకటించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్రంలోని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందరూ ఓట్లు హక్కు వినియోగించాల్సి ఉన్నందువల్ల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్రంలో సంస్థలు, కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే అందరికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలంగాణ కార్మికశాఖ పేర్కొంది. అందరూ తప్పనిరిగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మికశాఖ స్పష్టం చేసింది.
అయితే ప్రతీ ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున ప్రభుత్వాలు సెలవు ప్రకటిస్తూ ఉంటాయి. అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తాయి. దీంతో నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరగనున్న క్రమంలో ఆ రోజున ప్రభుత్వం హాలిడే ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధి రీత్యా సొంత ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో చాలామంది ఉంటారు. అలాంటివారు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తమ సొంత ప్రాంతానికి రావాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వం పోలింగ్ రోజున సెలవు ప్రకటిస్తూ ఉంటుంది. దీని వల్ల ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశముంటుంది. ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలు ప్రజలతో పాటు ప్రభుత్వానికి కూడా కీలకమని చెప్పవచ్చు. ఒక పండుగలా పోలింగ్‌ను ఈసీ నిర్వహిస్తూ ఉంటుంది. దీంతో ప్రతీ ఎన్నికల్లో పోలింగ్ రోజున సెలవు ప్రకటిస్తున్నారు.
ఓటింగ్ శాతం అనేది ప్రతీ ఏడాది తగ్గుతూ వస్తోంది. దీంతో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ అనేక చర్యలు తీసుకుంటుంది. ఓటు విలువ గరించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం అనేక కార్యక్రమాలు ఈసీ చేపడుతోంది. అలాగే పలు స్వచ్చంధ సంస్థలు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటు హక్కు గురించి ప్రజలకు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. పార్టీలన్నీ గెలుపే టార్గెట్‌గా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేస్తోన్నాయి. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా.. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. దీంతో కొద్దిరోజులు మాత్రమే ప్రచారానికి టైమ్ ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పార్టీలన్నీ మునిగిపోయాయి. అలాగే సోషల్ మీడియాలో ద్వారా ఎన్నికల ప్రచారం చేస్తోన్నాయి.
ప్రసార మాధ్యమాలతో పాటు టీవీలలో యాడ్స్ ఇస్తూ ప్రజలకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేలు హంగ్ వచ్చే అవకాశముందని కూడా చెబుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రజలు కూడా తెలంగాణ ఎన్నికల గురించి తెలుసుకుంటున్నారు.