అన్వేషించండి

Telangana News : ఆ కట్టడాలు సూపర్ - తెలంగాణకు ఐదు గ్రీన్ యాపిల్ అవార్డులు !

తెలంగాణకు ఐదు గ్రీన్ యాపిల్ ఇంటర్నేషనల్ అవార్డులు లభించాయి.

 

Telangana News :   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పలు కట్టడాలకు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.  కొత్తగా నిర్మించిన సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్‌, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణాలకు లండన్‌లోని గ్రీన్‌ ఆర్గనైజేషన్‌  .. గ్రీన్‌ యాపిల్ అవార్డులు ప్రకటించింది.  భారత్‌కు గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు రావడం ఇదే ప్రప్రథమమని ఈ సందర్భంగా గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ వెల్లడించింది.

ఐదు కట్టడాలకు గ్రీన్ చానల్ అవార్డులు                                    

బ్యూటిఫుల్‌ వర్క్‌స్పేస్‌ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ సచివాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డు లభించింది.   హెరిటేజ్‌ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్‌కు పురస్కారం ఇచ్చారు.  యూనిక్‌ డిజైన్‌ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జికి, స్పెషల్‌ ఆఫీస్‌ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు వచ్చాయి. మే 16న లండన్‌లో జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో స్పెషల్‌ సీఎస్‌ అరవింద్‌ కుమార్‌ ఈ అవార్డులను అందుకోనున్నారు. 

అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు - విమర్శలకు బొత్స మార్క్ కౌంటర్ !

ఐదు అవార్డులు రావడంపై కేసీఆర్ హర్షం                           

తెలంగాణకు ఐదు అంతర్జాతీయ అవార్డులు రావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ది గ్రీన్ ఆర్గనైజేషన్‌ 1994లో లండన్‌లో ఏర్పాటైంది. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ గురించి ప్రచారం చేయడంతో పాటు.. ఇందుకు కృషి చేస్తున్న వారిని ఇది గుర్తించి అవార్డులు అందిస్తున్నది. ఈ మేరకు 2016 నుంచి గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు మొదలుపెట్టింది. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న సంస్థలు, కౌన్సిల్స్‌, కమ్యూనిటీలకు ఇది అవార్డులను అందిస్తోది.                            

హైదరాబాద్‌ నిమ్స్‌లో నూతన భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన- దశాబ్ధి బ్లాక్‌గా నామకరణ

అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ ది గ్రీన్ ఆర్గనైజేషన్‌                  

అత్యంత విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయంగా నిర్మించడంతో పాటు ఇతరత్రా విషయాలను పరిగణలోకి తీసుకుని భవన నిర్మాణాలకు ఇంటర్నేషనల్‌ బ్యూటిఫుల్‌ బిల్డింగ్స్‌ గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను అందజేస్తున్నది. నివాసాలు, కోటలు, మ్యూజియం, బ్రిడ్జిలు, మతపరమైన స్మారక కట్టడాలు, వారసత్వ కట్టడాలు.. ఇలా వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు ఇస్తున్నది. గతంలో లండన్‌లో బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ , నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఖతార్‌, మలేసియాలోని జలాన్‌ మహ్‌కోట ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాయి.

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
KBR Park Elevated Corridors: కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్.. బాలకృష్ణ సహా ప్రముఖుల స్థలాలు సేకరణ
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget