అన్వేషించండి

Botsa On Amith Shah : అమిత్ షా అమాయకుడు ఏదేదో మాట్లాడతాడు - విమర్శలకు బొత్స మార్క్ కౌంటర్ !

అమిత్ షా అమాయకుడని ఏదేదో మాట్లాడతారని బొత్స సత్యనారాయణ తేలికగా తీసుకున్నారు. బీజేపీ నేతల మాటలన్నీ చంద్రబాబు మాటలేనన్నారు.

 

Botsa On Amith Shah :   కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమాయకుడని.. ఆయన ఏదేదో మాట్లాడరని  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ప్రభుత్వం కుంభకోణాల మయమని ..  అమిత్ షా విశాఖలో చేసిన విమర్శలపై బొత్స స్పందించారు. అమిత్ షా  అమాయకుడు  ఏదేదో  మాట్లాడతాడు... బీజేపీ  కి  ఉన్న  ఓట్  బాంక్  ఎంత అని మీడియా  ప్రతినిధుల్ని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మాటల్నే అమిత్ షా మాట్లాడుతున్నారన్నారు.  ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ మాట్లాడారని అర్ధమవుతోందన్నారు. గురివింద గింజల్లా తమ కింద మచ్చను బీజేపీ నేతలు చూసుకోవాలని బొత్స సూచించారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి ఏంటో బీజేపీ నేతలు పరిశీలించుకోవాలన్నారు. ప్రధానితో తమ బంధం ఎలా ఉందో అమిత్‌ షాతోనూ అలానే ఉందన్నారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువ లేవన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పేవరకూ ఎంపీ జీవీఎల్‌కు రాష్ట్రంలో అవినీతి గురించి తెలియదా? అని  బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఇంతకాలం జీవీఎల్ ఎందుకు ప్రశ్నించలేదో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.  కేంద్ర  రాష్ట్ర  సంబంధాలు  చెడిపోయా యని జరుగుతన్న ప్రచారాన్నీ ఖండించారు. అలా ఎవరన్నారని.. ప్రశ్నించారు. అయితే  
కేంద్రం పై  ప్రత్యేక  హోదా కు  సంబంధించి  పోరాటం  చేస్తూనే  ఉన్నామని..  పోరాటానికి  ఆకారం  ఉంటుందా అని బొత్స తనదైన శైలిలో సమర్థించుకున్నారు. 

గతంలో తాము  ప్రతిపక్ష  పార్టీ  గా  ఉన్నప్పుడు  కూడా  హోదా  ఆడిగామన్నారు.  మా  ఎంపీ లు  నిత్యం  పోరాటం  చేస్తున్నారని.. దేశానికి  సంబంధించి న  అంశం  వస్తే  బిల్లుల  విషయంలో   కేంద్రానికి  మద్దతు  ఇస్తున్నామన్నారు.  పవన్  కళ్యాణ్  యాత్ర  అంటే  తనకు అర్థం కావడం లేదని ..  కాశీ  యాత్ర  లాగా  వారాహి  యాత్రనా అని ప్రశ్నించారు.  యాత్ర కు  పర్మిషన్లు  ఇవ్వడం పాలన  లో ఒక  భాగం...సెలెబ్రిటీ  లుూ పెర్మిషన్   తీసుకుంటారని  స్పష్టం చేశారు.  పవన్  యాత్ర పై  ఎలాంటి  ఆంక్షలు  లేవన్నారు.  ప్రజలకు  ఇబ్బంది  లేకుండా యాత్ర లు  చేసుకోవాలని సూచించారు.  వైసీపీ   విముక్త  అంటే  ఏంటి..విద్యా  విధానం..రైతులకు  జరిగే  మేలు..వైద్య  విధాన నిర్ణయాలు  అన్ని  ఆపేస్తారా  అని ప్రశ్నించారు.  మేము  ఒకటి  ఇస్తే  పవన్  పార్టనర్  రెండు  ఇస్తా  అంటున్నాడు...అంతిమంగా  ప్రజలు  కోరుకునేది  జరుగుతుందని జోస్యం చెప్పారు. 

ఏపీకి అందరితో పాటు రెండు వందే భారత్ రైళ్లు ఇవ్వటం తప్ప బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులు ఇచ్చి ఏదో ఉద్ధరించామంటే ఎలా ? వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలి. గతంలో బీజేపీ నుంచి మాకున్న బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి? ఇప్పుడు లేనిది ఏంటి? బీజేపీ నుంచి మాకు ఎలాంటి వెన్ను దన్ను ప్రత్యేకంగా లేదు. 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి.. మా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారు కాబట్టి మా వ్యూహాలు మాకు వున్నాయి’’ అని తెలిపారు.       

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
హైదరాబాద్ మెట్రో మరింత విస్తరణ- మేడ్చల్ వరకూ పొడిగింపు - డీపీఆర్‌కు రేవంత్ ఆదేశం
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Kill: తల్లి, నలుగురు అక్కచెల్లెళ్లను నరికి చంపేశాడు - వాళ్ల గౌరవం కాపాడానని వీడియో రిలీజ్ చేశాడు !
తల్లి, నలుగురు అక్కచెల్లెళ్లను నరికి చంపేశాడు - వాళ్ల గౌరవం కాపాడానని వీడియో రిలీజ్ చేశాడు !
Embed widget