News
News
X

Donations for Govt School: గవర్నమెంట్ స్కూల్‌కి మీ పేరు ఉండాలా? ఇలా చేయొచ్చు, పిలుపునిచ్చిన కేటీఆర్

విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వివరాలు చెప్పారు.

FOLLOW US: 
 
గవర్నమెంట్ స్కూళ్లలో చక్కని మౌలిక వసతులు, నాణ్యమైన విద్య లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ‘మన ఊరు – మన బడి’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కార్యక్రమంలో విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులు భాగస్వాములు అయ్యేలా అవకాశం కల్పించారు. వారు విరాళాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఏదైనా ప్రభుత్వ పాఠశాలకు రూ.కోటి లేదా అంతకన్నా ఎక్కువ విరాళం ఇస్తే.. వారి పేరు లేదా వారు సూచించిన వారి పేర్లను గవర్నమెంట్ స్కూళ్లకు పెడతామని మంత్రి ప్రకటించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలు చెప్పారు.

దీనికి ప్రత్యేక వెబ్‌సైట్‌
‘మన ఊరు – మన బడి’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో రూ.7,289 కోట్లతో సుమారు 26 వేల స్కూళ్లను అభివృద్ధి చేయనుందని కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రూ.కోటి లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఎవరు ఇచ్చినా వారు సూచించిన పేరును పాఠశాలకు పెడతామని కేటీఆర్ చెప్పారు. అయితే, రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విరాళం ఇచ్చేవారికి మాత్రం తరగతి గదులకు పేర్లు పెడతామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పెద్ద మనసుతో సాయం చేసేందుకు ముందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

రాష్ట్ర ఆవిర్భావంతో విద్యా రంగంలో అనేక సానుకూల మార్పులు వచ్చాయని, మన ఊరు - మన బడితో ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా రూపాంతరం చెందుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చే ఎన్నారైలకు విద్యా శాఖ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని అన్నారు. తొలి విడతలో 60 శాతంపైగా విద్యార్థులు చదివే 35 శాతం పాఠశాల లను ఎంపిక చేసి, ఆయా పాఠశాలను అభివృద్ధి చేసే ప్రక్రియను ఓ యజ్ఞంలా చేపట్టనున్నట్లు ప్రకటించారు.

గ్రామాల్లో ‘మన ఊరు–మన బడి’, పట్టణాల్లో ‘మన బస్తీ– మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ముందుకెళ్తుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. 12 అంశాలతో రాష్ట్రంలోని 9,123 పాఠ శాలలను మొదటి దశలో అభివృద్ధి చేయ నున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

News Reels

Published at : 13 Feb 2022 12:09 PM (IST) Tags: minister ktr Telangana Govt Government schools Mana ooru mana badi scheme Donations for govt schools

సంబంధిత కథనాలు

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

TS News Developments Today: నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ టూర్, వేర్వేరు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

APEAPCET 2022 Counselling: నేటి నుంచి 'ఫార్మసీ' కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Paramedical Officer: తెలంగాణలో 1491 పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Paramedical Officer:  తెలంగాణలో 1491  పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

బాధితులు ఒక్కరే కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

బాధితులు ఒక్కరే కాదు పదుల సంఖ్యలో అమ్మాయిలు- సంచలనం రేపుతున్న హ‌న్మకొండ రేప్‌ కేస్‌

రాజ్ భవన్ కు చేరిన షర్మిల పంచాయితీ, రియాక్షన్‌ ఎలా ఉంటుంది?

రాజ్ భవన్ కు చేరిన షర్మిల పంచాయితీ,  రియాక్షన్‌ ఎలా ఉంటుంది?

టాప్ స్టోరీస్

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?