అన్వేషించండి

Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలపై కీలక ఆదేశాలు

Telangana News: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు శుభవార్త అందించింది. టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.

Telangana Government Good News To Anganwadi Workers: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అంగన్వాడీ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు (Anganwadi Teachers), హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రహమత్ నగర్‌లో నిర్వహించిన 'అమ్మ మాట - అంగన్వాడీ బాట' కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని.. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్‌గ్రేడ్

మొదటి దశలో ప్రభుత్వ పాఠశాల భవనాల్లోని సుమారు 15 వేల అంగన్వాడీ కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తున్నారు. వాటిని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Rythu Runa Mafi: రుణమాఫీకి ఇన్ని కండీషన్లా? అవి రైతులకు ప్రయోజనం లేని మార్గదర్శకాలు: మహేశ్వర్ రెడ్డి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
TPCC Showcause Notice: టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?
టీ కాంగ్రెస్‌లో కల్లోలానికి ముగింపు ఉంటుందా? టీపీసీసీ క్రమశిక్షణా చర్యల్లో సీరియస్ నెస్ ఉందా?

వీడియోలు

Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget