Krishna Water Dispute : "గ్రీన్ కో"కు నీళ్ల కేటాయింపులపై తెలంగాణ అభ్యంతరం - కృష్ణా బోర్డుకు ఫిర్యాదు !
గ్రీన్‌కో ప్రాజెక్టుకు కృష్ణా ప్రాజెక్టు నుంచి నీళ్లు కేటాయించడం చట్ట విరుద్ధమని కృష్ణాబోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వ జీవోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరింది.
Krishna Water Dispute : కర్నూల్ జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్ కో విద్యుత్ ప్రాజెక్టుకు కృష్ణా జలాలలను కేటాయించడంపై తెలంగాణ ... కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని తక్షణం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగామ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ లేఖ రాశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణాపై ఏపీ పంప్‌డ్ స్టోరేజ్ పథకాలను చేపట్టిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ చేపట్టిన అన్ని పంప్‌డ్ స్టోరేజ్ పథకాల వివరాలు తెప్పించి ఇవ్వాలని బోర్డును కోరారు.
కులమే బలం - తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల తారక మంత్రం !
సోమవారం కృష్ణా బోర్డు ( KRMB ) రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం జరిగింది. అందులో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీట్టిమట్టం 854 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కోరారు. కనీస నీటిమట్టానికంటే దిగువ నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ తరపున ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్‌సీ, జెన్‌కో డైరెక్టర్ వరుసగా రెండో సమావేశానికీ గైర్హాజరయ్యారు. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను చెప్పి వచ్చేశారు. అయితే సమావేశానికి వెళ్లని తెలంగాణ అధికారులు లేఖ మాత్రం రాశారు.
ఆత్మహత్య చేసుకోవద్దు, అధైర్య పడవద్దు మీకోసం పోరాడతాం - సర్పంచ్‌లకు బండి సంజయ్ బహిరంగ లేఖ
సోమవారం తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ( GRMB ) కూడా లేఖ రాసింది. పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం తెలుపుతూ జీఆర్‌ఎంబీ చైర్మన్‌కు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. పోలవరం డెడ్‌స్టోరోజ్ నుంచి నీటి ఎత్తిపోతల సబబుకాదని తెలిపారు. గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందంటూ అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తున్న విషయాన్ని గుర్తు చేసిన ఈఎన్‌సీ, మరి ఏపీ కొత్త ప్రాజెక్టులేంటని ప్రశ్నించారు. దీనిపై గోదావరి నదీయాజమాన్య బోర్డు చేసుకోవాలని కోరారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ కోరారు.