Telangana News: గల్ఫ్ మృతులకు ఎక్స్‌గ్రేషియా - తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Hyderabad News: గల్ఫ్ దేశాల్లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది.
Telangana Government Guidelines To Deaths In Gulf Countries: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ మరణించిన కార్మికులకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మార్గదర్శకాలు జారీ చేసింది. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో 2023, డిసెంబర్ 7 తర్వాత మరణించిన కార్మికులకు ఈ పరిహారం వర్తిస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి పేరుతో ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కార్మికులు మృతి చెందిన 6 నెలల్లోగా భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. డెత్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్, బ్యాంకు ఖాతా వివరాలు అందించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా మృతుల కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు.
Also Read: HYDRA App: చెరువుల కబ్జాకు చెక్ - త్వరలోనే హైడ్రా యాప్ లాంచ్, అందులోనే ఫిర్యాదులు