Alpha Hotel: పాడైపోయిన మటన్‌తో బిర్యానీ - సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌పై కేసు, జరిమానా
Telangana News: నగరంలోని పలు హోటళ్లలో టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ ఆల్ఫా, సందర్శిని, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో తనిఖీలు చేపట్టారు.
Taskforce Checkings In Secunderabad Alpha Hotel: ఇటీవల నగరంలోని పలు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బుధవారం రాత్రి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్‌లో (Secunderabad Alpha Hotel) సోదాలు చేసిన అధికారులు.. నాసిరకం ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ వండుతున్నట్లు గమనించారు. ఫుడ్ ముందుగానే తయారుచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి కస్టమర్లు వచ్చిన వేళ దాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్ఫా హోటల్‌లో తయారు చేసే బ్రెడ్‌తో పాటు ఐస్‌క్రీమ్ డేట్ బ్యాచ్ లేకుండా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీ ఫౌడర్ కూడా నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో అపరిశుభ్రంగా దారుణ పరిస్థితులు ఉన్నట్లు వెలుగులోకి తెచ్చారు. ఈ క్రమంలో నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు హోటల్‌పై కేసు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధించారు.
Task force team has conducted inspections in Secunderabad area on 18.06.2024.
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 19, 2024
𝗔𝗹𝗽𝗵𝗮 𝗛𝗼𝘁𝗲𝗹, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱
* Improper storage of raw meat & semi prepared food articles in refrigerator with possibility of cross-contamination.
* Unhygienic conditions like… pic.twitter.com/E0wFyoHUGy
మరో హోటల్‌లోనూ..
𝗛𝗼𝘁𝗲𝗹 𝗦𝗮𝗻𝗱𝗮𝗿𝘀𝗵𝗶𝗻𝗶, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 19, 2024
18.06.2024
* Improperly labelled Jaggery cubes (9kg), Paratha packets (10pkts), Expired Noodles packets (2pkts) were seized.
* Food articles stored inside refrigerator were covered but not labelled properly.
* FSSAI… pic.twitter.com/2aNO4o2ob3
𝗥𝗮𝗷 𝗕𝗮𝗿 & 𝗥𝗲𝘀𝘁𝗮𝘂𝗿𝗮𝗻𝘁, 𝗦𝗲𝗰𝘂𝗻𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) June 19, 2024
18.06.2024
* The FSSAI license copy displayed at the premises was found to have expired on 05.06.2018 and no valid FSSAI l koicense available with the FBO.
* Rat was observed near dustbin area. No rat traps… pic.twitter.com/BA7XLU4JjZ
అలాగే, సికింద్రాబాద్‌లోని సందర్శిని హోటల్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎక్స్‌పైరీ అయిన నూడుల్స్ ప్యాకెట్, అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు గుర్తించారు. అటు, రాజ్ బార్ అండ్ రెస్టారెంట్‌లోనూ సోదాలు చేశారు. కిచెన్‌లో ఎలుకలు తిరుగుతున్న దృశ్యాలను చూసి అధికారులు షాకయ్యారు. కిచెన్‌లో దారుణ పరిస్థితులను చూసి బార్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు, మాదాపూర్, అమీర్ పేట్, ఎస్సార్ నగర్ ఇలా కొన్ని ప్రాంతాల్లోని హాస్టళ్లను సైతం టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. కిచెన్లలో అపరిశుభ్ర పరిస్థితులను గమనించిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: BRS MLA Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహీపాల్ ఇంట్లో ఈడీ సోదాలు - గనుల వ్యవహారంలో నమోదైన కేసుపై!