![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KCR: ఓమ్నీ వ్యాన్ నడిపిన మాజీ సీఎం కేసీఆర్ - వైరల్ అవుతోన్న గులాబీ బాస్ ఫోటో
Telangana News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత ఓమ్నీ వాహనాన్ని నడిపారు. శస్త్ర చికిత్స అనంతరం చేతి కర్ర సాయంతో నడిచిన ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. వైద్యుల సూచన మేరకు పాత ఓమ్నీ వాహనం నడిపారు.
![KCR: ఓమ్నీ వ్యాన్ నడిపిన మాజీ సీఎం కేసీఆర్ - వైరల్ అవుతోన్న గులాబీ బాస్ ఫోటో telangana ex cm kcr drove old omni van and photo viral latest news KCR: ఓమ్నీ వ్యాన్ నడిపిన మాజీ సీఎం కేసీఆర్ - వైరల్ అవుతోన్న గులాబీ బాస్ ఫోటో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/3c36f5d70a5660902d393e8d0352795a1719482337953876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KCR Drove Old Omni Van: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) గురువారం పాత ఓమ్నీ వాహనాన్ని నడిపారు. కాలి ఆపరేషన్ తర్వాత ఆయన కర్ర సాయం లేకుండా నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడపాలని డాక్టర్లు కేసీఆర్కు సూచించారు. దీంతో కేసీఆర్ స్వయంగా ఓమ్నీ వాహనాన్ని నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే, 'సారు మళ్లీ కారు నడుపుతున్నారు' అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, గతేడాది డిసెంబర్ 8న అర్ధరాత్రి తన నివాసంలో కేసీఆర్ కాలు జారిపడ్డారు. ప్రమాదానికి గురైన తర్వాత కేసీఆర్కు వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కేసీఆర్ను వాకర్ సాయంతో నడిపించారు. డిశ్చార్జి తర్వాత కూడా ఆయన వైద్యుల సూచన మేరకు చాలా రోజులు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకు చేతి కర్ర సాయంతో నడిచారు. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున చేతి కర్ర సాయంతోనే పలు సభలు, సమావేశాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని.. వైద్యుల సూచన మేరకు ఓమ్నీ వాహనం నడిపారు.
Also Read: Khammam Sitrama Project: సీతారామా ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం- కంగ్రాట్స్ చెప్పిన కేటీఆర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)