అన్వేషించండి

Venkaiah Naidu: బీ అలర్ట్! అవినీతిపరులు రాజకీయాల్లో పుంజుకుంటున్నారు: వెంకయ్య నాయుడు సంచలనం

త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరులు రాజకీయాల్లో పుంజుకుంటున్నారని చెప్పారు.

Venkaiah Naidu Visits Tirumala:

తిరుపతి : నీతి, నిజాయితీ ఉన్న రాజకీయ‌ నాయకులను ఎన్నుకోవడం భారతీయ పౌరులుగా అందరి బాధ్యత అని మాజీ‌ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. త్వరలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవినీతి పరులు రాజకీయాల్లో పుంజుకుంటున్నారని, ఇది సమాజానికి హానికరం అంటూ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం న్యూఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యకి కోలా ఆనంద్, భాను ప్రకాష్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారికి వచ్చే ఆదాయం ఆలయ పరిసరాల శుభ్రతకు, పురాతన ఆలయాలకు కైంకర్యాలకు, హిందూ ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని ఆయన టీటీడీ ()TTDని కోరారు. శ్రీవారి ఆదాయం ప్రతి రూపాయిని తిరుమల అభివృద్ధి కోసమే వాడాలని సూచించారు. ఆలయ నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి నిధులు వాడాలన్నారు. గ్రామాల్లో టీటీడీ సహకారంతో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరుమల పేరుతో కళ్యాణ మండపాలు, దేవాలయ మండపాలు ఏర్పాటు చేసుకోవాలని టీటీడీకి సూచించారు. ధర్మ పరిరక్షణతో పాటు ప్రజలకు ప్రార్థనాలు, ఏవైనా కార్యక్రమాలు చేసుకోవడానికి  తిరుమల శ్రీవారి ఆలయం నిధులు వెచ్చించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం లాంటి కొన్ని మంచి పనులకు శ్రీకారం చుట్టాలని కోరారు. హిందూ ధర్మ పరిరక్షణ, శ్రీవారి ఆలయం నిధులపై బయటి వ్యక్తులు జోక్యం చేసుకోకూడదని సూచించారు. 

ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో యువత, ఓటు లేని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో నీతి నిజాయితీగా నిక్కసుగా ఉండే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి పరులు రాజకీయాల్లో‌ పుంజుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మంచి నాయకుడిని ఓటు వేసి ఎన్నుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా మన అందరి మీద ఉందని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోకూడదని చెప్పారు. రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, ధనం చూసి అభ్యర్థులకు ఓట్లు వేస్తే ప్రజలకు సమస్యలు తప్పవన్నారు. గుణం, నేత వ్యక్తిత్వం వాళ్లు చేసే మంచి పనులు చూసి ఓటు వేసి గెలిస్తే మెరుగైన సమాజం ఉంటుందని, లేకపోతే అయిదేళ్ల పాటు ప్రజలు నష్టపోతారని సూచించారు. ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షాల నేతలు ఎవరు ప్రజల కోసం ఏం చేశారు. ఓట్లకు డబ్బు ఆశ పడకుండా, నీతి, నిజాయితీగా ఉండే వారిని గెలిపించుకోవాలన్నారు. చెప్పిన హామీలు నెరవేర్చారా, మాట నిలబెట్టుకునే వ్యక్తులా కాదా అని చూసి ఓటు వేయాలని ప్రజలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య కీలక సూచనలు చేశారు.

Also Read: కేసీఆర్ గుడ్‌విల్ సున్నా- కాంగ్రెస్‌కు చాన్సివ్వాలన్నది ప్రజల నిర్ణయం - రేవంత్ కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget