అన్వేషించండి

KCR in Wanaparthy: మొనగాడు కావాలా చిల్లరగాళ్లు కావాలా? తేల్చుకోండి - వనపర్తి సభలో కేసీఆర్

వనపర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

గతంలో వలసల వనపర్తిని.. వరి పంటల వనపర్తిగా చేసిన మొనగాడెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పని చేశారని.. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, నిరంజన్‌ రెడ్డి పట్టుబట్టి.. మొత్తం 5 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

ఆనాడు ఉన్న తెలంగాణ ఊడగొట్టింది ఎవరని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరుగుతున్నప్పుడు నోరెత్తకుండా ఉండిపోయింది ఎవరని ప్రశ్నించారు. ఇప్పుడు వనపర్తికి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాబోతోందని, అది వస్తే లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని అన్నారు. వరి పంటల వనపర్తి చేసిన మొనగాడు కావాలా? లేనిపోని ఉల్టాపల్టా చిల్లరగాళ్లు కావాలా అని ప్రజల్ని అడిగారు. కరవు మళ్లీ ఎదురు కాకుండా వనపర్తి తయారవుతుందని చెప్పారు.

తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కేసీఆర్‌లు ఉన్నారని అన్నారు. నేను రావాల్సిన అవసరం లేదని అన్నారు. ముస్లింలను కాంగ్రెస్‌ పార్టీ కేవలం ఓటు బ్యాంకు లాగానే చూసిందని విమర్శించారు. అడ్డం పొడుగు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ గతంలో అన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారని గుర్తు చేశారు. వాళ్లు తేలేని మెడికల్ కాలేజీలను నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నారని అన్నారు.

తెలంగాణ గురుకులాల్లో ఇవాళ వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారని.. ఓట్ల కోసం అబద్ధాలు చెప్పబోమని అన్నారు. మళ్లీ గెలిస్తే.. పింఛన్లను దశలవారీగా రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతులకు ఏ ప్రభుత్వమైనా డబ్బులు ఎదురిచ్చిందా అని ప్రశ్నించారు.

టాప్ హెడ్ లైన్స్

Prakash Goud Son Santosh Goud Allegations: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇంట్లో ప్రేమ చిచ్చు - తండ్రి ప్రకాష్ గౌడ్‌పై కుమారుడు సంచలన ఆరోపణలు
Medaram Latest News: మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
మేడారం వనదేవతల గద్దెల వద్ద జువ్వి చెట్టు పునఃదర్శనం!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget