By: ABP Desam | Updated at : 28 Jul 2022 08:45 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
కొత్తగా నమోదైన కరోనా కేసులు తెలంగాణలో బాగా పెరిగాయి. గత 24 గంటల్లో 36,764 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 852 కొత్త పాజిటివ్ కేసులను గుర్తించారు. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,16,531కు పెరిగింది. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత ఒక్కరోజే 800 పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే ఎక్కువ. అయితే, కొద్ది నెలలుగా మరణాలేవీ సంభవించడం లేదు. మరోవైపు, కొత్తగా 640 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ కొత్త కేసులు అధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 358 నమోదయ్యాయి. మరోవైపు, ఇప్పటిదాకా మొత్తం 8,07,505 మంది బాధితులు కోలుకున్నారు.
Corona Cases India: దేశంలో క్రితం రోజుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 18,313 కరోనా కేసులు నమోదయ్యాయి. 57 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి తాజాగా 20,742 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.
మొత్తం కేసులు : 4,39,38,764
మొత్తం మరణాలు: 5,26,167
యాక్టివ్ కేసులు: 1,45,026
మొత్తం రికవరీలు: 4,32,67,571
దేశంలో కొత్తగా 27,37,235 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,02,79,61,722 కోట్లు దాటింది. మరో 4,25,337 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు
Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే
ABP Desam Anniversary: ఏబీపీ దేశం తొలి వార్షికోత్సవం- మొదటి అడుగుతోనే మరింత ముందుకు
Nature Index Rank: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీనే నెంబర్ వన్ - నేచర్ ఇండెక్స్ ర్యాంకులో టాప్
By Election Fever : నాడు ఉపఎన్నికలే బ్రహ్మాస్త్రం - నేడు వాటితోనే గండం ! టీఆర్ఎస్కు "ఆర్" ఫ్యాక్టర్ ఫికర్ !
Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!
Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!
Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్
Hyderabad Traffic Today: వాహనదారులకు అలర్ట్! నేడు ఈ రూట్స్లోకి నో ఎంట్రీ, భారీ ట్రాఫిక్ జామ్! వేరే మార్గాలివీ