By: ABP Desam | Updated at : 11 Jan 2023 01:48 PM (IST)
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ధాక్రే రాక - గాంధీ భవన్‌లో సమావేశాలు
Manik Rao Thackeray : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు ధాక్రే చార్జ్ తీసుకున్నారు. ఆయన తెలంగాణ పార్టీని గాడిన పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గాంధీ భవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జి హోదాలో తొలిసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి , మల్లు భట్టి విక్రమార్క, వీహెచ్, పలువురు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా గాంధీభవన్ కు చేరుకుని ముఖ్యనేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబులతో వేర్వేరుగా థాక్రే భేటీ అయి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీని కూడా నిర్వహిస్తారు.
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే గారికి @Manikrao_INC గాంధి భవన్‌లో ఘన స్వాగతం పలికిన ఎఐసిసి కార్యదర్శి బోసురాజు గారు @NsBoseraju రోహిత్ చౌదరీ గారు @RohitChINC పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు @revanth_anumula సీఎల్పీ నేత భట్టి విక్రమార్క @BhattiCLP pic.twitter.com/bWDkFdXgti
— Telangana Congress (@INCTelangana) January 11, 2023
గురువారం కూడా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారు. డీసీసీలు, ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్‌లు, అధికార ప్రతినిధులతో మాణిక్‌రావు థాక్రే చర్చించనున్నారు. మరోవైపు ఈనెల 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రపైనా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశమూ ఉంది. కొత్త ఇంచార్జ్ రాకపై సీనియర్ నేతల స్పందన ఎలా ఉంటుందోనని టీ కాంగ్రెస్ వ్యవహారాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఏ నేత ఇంచార్జ్ గా వచ్చినా అసమ్మతి గ్రూపు వారికి చుక్కలు చూపిస్తూ వస్తోంది. అప్పట్లో కుంతియా..ఆ తర్వాత వచ్చిన మాణిగం ఠాగూర్ కూడా అసంతృప్తి నేతలను తట్టుకోలేకపోయారు.
హైకమాండ్ ను బతిమాలి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఇప్పుడు మహారాష్ట్ర నేత వస్తున్నారు. అయితే ఆయన ఇతర నేతల్లా సాఫ్ట్ కాదని.. చాలా హార్డ్ గా డీల్ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో సీనియర్ నేతలు ఆయనతో ఎలా ఉంటారన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇంచార్జ్ ను మార్పించడంలో సక్సెస్ అయ్యామనుకుంటున్న తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేతలు.. ఎలాగైనా పీసీసీ చీఫ్ ను కూడా మార్పించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని కోసం వారు హైకమాండ్ పై మరింత ఒత్తిడి వ్యూహం అమలు చేయనున్నట్లుగా చెబుతున్నారు.
అయితే వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే క్రమంలో గ్రూపులన్నింటినీ ఏకం చేసేందుకు మాణిక్ రావు ధాకరే ప్రయత్నించనున్నారు. సాఫ్ట్ గా డీల్ చేస్తే ఇప్పటి వరకూ అన్నీ ఎదురు దెబ్బలే తగిలాయి కాబట్టి ఈ సారి ధాకరే రూటు మారుస్తారని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ వ్యవహారశైలితోనే కాంగ్రెస్ లో గ్రూపులు పెరుగుతాయా.. తగ్గుతాయా అన్నది తేలే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్‌లో నేతలందరూ తమ తమ వాదనలు వినిపించే ప్రయత్నంలో ఉన్నారు. సీనియర్లకు గతంలోలాగే పరిస్థితులు ఉన్నాయనిపిస్తే వారు వ్యక్తం చేసే స్పందన కీలకం కానుంది.
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు
TSPSC Group1 Mains Exam Dates: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్ పీఎస్సీ
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌గా భారతి హోళికేరి