అన్వేషించండి

Telangana News: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి- కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై అధిష్టానంతో చర్చించే అవకాశం!

Telangana CM Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు.

Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతుంది. అందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మంత్రివర్గ విస్తరణకు  అడుగు ముందుకు పడనుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. సోమ, మంగళ వారాల్లో ఢిల్లీలోనే ఉండనున్న రేవంత్ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.  తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పలు అంశాలపై హైకమాండ్ తో చర్చించే అవకాశముంది. దాంతో పాటు రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు.

నామినేటెడ్ పోస్టుల భర్తీ పై దృష్టి
అలాగే కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల అంశంపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబరు 9న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. ఆ రోజే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుత రేవంత్ కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుంటే ఈ సంఖ్య 12గా ఉంది. దీంతో మరో ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం పలువురు నేతలు కొన్నాళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కీలక నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆ తర్వాత మంత్రివర్గ ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ  ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ లోకసభ ఎన్నికల పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఎన్నికలు పూర్తి కావడంతో  పూర్తిస్థాయి కేబినెట్ టీమ్ తో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. దీంతో నామినెటేడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.   

కేబినెట్ లో చోటు దక్కేదెవరికి ?
కేబినెట్లో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కేబినెట్లో ఆరు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండడంతో  చాలా మంది పదవి రేసులో ఉన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారు కూడా ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్  ఉన్నట్లు తెలుస్తోంది.  దీంతో ఆయా జిల్లాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. రేవంత్ తన కేబినెట్లోకి ఎవరిని తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.   

ఆ నాలుగు జిల్లాలకు ఛాన్స్ ?
ఇప్పుడున్న  కేబినెట్ లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించలేదు.  దీంతో తాజా విస్తరణలో ఆ నాలుగు జిల్లాలకు కచ్చితంగా చోటు కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే  రెడ్డి సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉన్నారు. బీసీ, ఎస్సీ సామాజికవర్గాల నుంచి ఇద్దరు, ఎస్టీ, కమ్మ, వెలమ సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే విస్తరణలో  సామాజిక సమీకరణాలు కీలకంగా ఉంటాయని సమాచారం. ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తారని తెలుస్తోంది.  ఇటీవలే బీఆర్ఎస్ కు నుంచి కాంగ్రెస్ లోకి చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  కేబినెట్ రేసులో ఆయన కూడా ఉన్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జిల్లా నుంచి మదన్ మెహన్ తో పాటు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మొదటి నుంచి మంత్రి పదవి కోసం తీవ్రంగా యత్నిస్తూనే ఉన్నారు.  ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు ఆశావాదుల జాబితాలో ఉన్నారు. వీరిలో ఒకరికి మాత్రమే పదవి దక్కే ఛాన్స్ ఉంది. 

అధినాయకత్వం ఆలోచన ఏంటీ
ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అయితే ఇక్కడ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు లేరు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన హైదరాబాద్ నుంచి కేబినెట్ బెర్త్ ను ఆశిస్తున్నారు. కాగా మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందుకు మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  అలాగే ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పేరు కూడా జాబితాలో ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి  మల్ రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.  చూడాలి మంత్రి పదవిలు ఎవరి దక్కుతాయో !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget