అన్వేషించండి

Telangana Election 2023: 'కేసీఆర్ దమ్మేందో ఇండియా మొత్తం చూసింది' - మీకు కన్పించలేదా?, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కౌంటర్

Telangana CM KCR: కేసీఆర్ దమ్మేంటో ఇండియా మొత్తం చూసిందని, మీకు కన్పించలేదా.? అంటూ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ దమ్మేందో ఇండియా మొత్తం చూసిందని, 'ఒకరు కొడంగల్ రా, కొడవలితో రా' అంటూ అడుగుతున్నారని, 'మీ కళ్లకు కన్పిస్తోంది కేసీఆర్ దమ్ము కాదా?' అంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేటలోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన ఆయన, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించానని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలుండేవని, ఇక్కడి ప్రజలు ముంబయికి ఉపాధి కోసం వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా.? అంటూ నిలదీశారు. 

ఇక ప్రజల వంతు

తెలంగాణ ప్రయాణంలో పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం కోసం తన వంతు పోరాటం అయిపోయిందని ఇక చేయాల్సింది ప్రజలే అని అన్నారు. 'తెలంగాణ కోసం ఒంటరి ప్రయాణం ప్రారంభించా. నా పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే విజయం సాధించాను. సరిపడా నీళ్లు, కరెంట్, సాగు, తాగు నీరు లేక ఎన్నో అవస్థలు పడ్డాం. ఇవాళ దేశం మొత్తంలో 24 గంటల కరెంట్ ఇస్తోన్న రాష్ట్రం తెలంగాణ. ప్రధాని రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దేశానికే దిక్సూచిలా నిలిచేలా తెలంగాణ ఎదిగింది. కేసీఆర్ దమ్ము దేశమంతా చూసింది. ఇప్పుడు కొత్తగా ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు.' అని పేర్కొన్నారు.

ఆలోచించి ఓటెయ్యండి

ఒకప్పుడు తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యం పండేదని, ఇప్పుడు 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. 24 గంటల కరెంట్ ఇస్తే, కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారని, ఆ తర్వాత వెనక్కు తగ్గారని గుర్తు చేశారు. రైతు బంధు పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని చెప్పారు. రైతు బంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. పాలమూరు - ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారని, ప్రాజెక్టులు పూర్తైతే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని ఇలా చేశారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎవర గెలిస్తే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందో, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అలా చేస్తే రైతులు మళ్లీ అధికారుల ముందు మోకరిల్లాల్సిన దుస్థితి వస్తుందని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆగం కాకుండా, అన్నీ ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు. బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఉన్న తెలంగాణను పోగొట్టింది కాంగ్రెస్ యేనని మండిపడ్డారు. 2004లో తెలంగాణ ఇస్తామని ప్రకటించి 2014లో ఇచ్చారని గుర్తు చేశారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించాలని కోరారు.

 

 

 

 

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget