Telangana Cabinet : 25న తెలంగాణ కేబినెట్ భేటీ - బడ్జెట్ ఆమోదంతో పాటు ..
CM Revanth : తెలంగాణ కేబినెట్ 25వ తేదీన సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్‌ను ఆమోదిస్తారు.
Telangana Cabinet will meet on 25th July : తెలంగాణ మంత్రివర్గం ఇరవై ఐదో తేదీన సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన పూర్తి స్థాయి బడ్జెట్ ను మంత్రి వర్గం ఆమోదిస్తుంది. ఇరవై మూడో తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇరవై ఐదో తేదీన బడ్జెట్ ప్రవేశ పెడతారు . ఆ రోజు ఉదయమే అసెంబ్లీ కమిటీ హాల్‌లో .. మంత్రివర్గం భేటీ అవుతుంది. రైతు భరోసా పథకంపై చర్చతో పాటు, జాబ్ కాలెండర్‌ను విడుదల చేయటం వంటి అంశాలను ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.
రెండున్నర లక్షల కోట్ల వరకూ తెలంగాణ పద్దు
ఈ సారి తెలంగాణ బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. నిజానికి ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించలేదు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 23వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలను బట్టి బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి రూ.60 వేల కోట్లకు పైగానే గ్రాంట్లు, రుణాల రూపంలో వస్తాయని అంచనా వేస్తున్నారు.
BRS ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు: గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై స్పష్టత
2023-24లో కేంద్రం నుంచి రూ.41,259 కోట్ల గ్రాంట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. చివరికి రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ కారణంగా గ్రాంట్లలో 76.42% సొమ్మును ఇవ్వకపోవడంతో, రాష్ట్ర ఆదాయం రూ.2.18 లక్షల కోట్లకే పరిమితమైంది. ఈ కారణంగానే 23న కేంద్ర బడ్జెట్‌ను జాగ్రత్తగా పరిశీలించి, గ్రాంట్లపై స్పష్టమైన అవగాహన వచ్చిన అనంతరం రాష్ట్ర ఆదాయ, వ్యయాల మొత్తాలను రుపొందించాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
టీడీపీ అరాచకాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి - ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
పథకాలకు భారీగా నిధుల కేటాయింపు
బడ్జెట్ లో ఈ సారి పథకాల కోసం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంది. ఒక్క రైతు బంధు పథకానికే రూ. 31 వేలు కేటాయించనున్నారు. అలాగే ఇతర పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంది. అందుకే అభివృద్ధి పనుల కన్నా ఈ సారి పథకాల తోనే బడ్జెట్ నిండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.