అన్వేషించండి

BJP Leaders Letters: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతల లేఖలు - కారణం ఏంటంటే?

Telangana News: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖలు రాశారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణను కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

BJP Leaders Letter to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) బుధవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ 'భారతమాల' పథకంలో భాగంగా.. తెలంగాణలో నిర్మించనున్న వివిధ జాతీయ రహదారులకు సంబంధించి భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆయన లేఖలో కోరారు. అలాగే, రీజనల్ రింగ్ రోడ్డు (RRR) భూ సేకరణ కోసం NHAIకు 50 శాతం నిధులను జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మార్గం సుగమం

అటు, హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాలు, కాలువల మళ్లింపు వంటి వాటి కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం NHAIకు లేఖ ఇచ్చింది.

బండి సంజయ్ లేఖ

మరోవైపు, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా.. సర్పంచుల పెండింగ్ బిల్లులపై సారించకపోవడం శోచనీయమని అన్నారు. సర్పంచులు తమ సొంత నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారని.. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులపై ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక సంస్థల ప్రతినిధులు, సర్పంచులు ఆందోళన చెందుతున్నారని లేఖలో ప్రస్తావించారు. వారి సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. పనులకు సంబంధించి రూ.1,850 కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.

'నిధులు దారి మళ్లించారు'

కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ హయాంలో దారి మళ్లించారని బండి సంజయ్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెండింగ్ బిల్లుల కారణంగా సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులను కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని.. వాటిని వెంటనే రికార్డు చేసేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సర్పంచులు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచాలని అన్నారు. అలాగే, మాజీ సర్పంచులు, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులకు పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి భద్రతపై ఫోకస్ - ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం

 

టాప్ హెడ్ లైన్స్

24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget