అన్వేషించండి

Telangana Assembly: 'ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు' - సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు

Telangana News: ఆటో డ్రైవర్ల అంశం, ఉచిత బస్సు ప్రయాణం, హామీల అమలు వంటి అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం వాడీ వేడీ వాదనలు సాగాయి. బీఆర్ఎస్ నేతల విమర్శలు మంత్రులు తిప్పికొట్టారు.

Serious Discussion in Telangana Assembly: ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్ల సమస్యల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని.. 30 మోసాలు, 60 అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. 'ప్రజా భవన్ కు వచ్చే వారి ఫిర్యాదులు తీసుకునేందుకు ఎవరూ లేరు. ఇప్పటివరకూ ఎవరి సమస్యలైనా పరిష్కరించారా.?. ఆరోగ్య శ్రీ ద్వారా ఎవరికైనా రూ.10 లక్షలు ఇస్తున్నారా.? 13 హామీలిచ్చి రెండు పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా లేక మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 'మహాలక్ష్మి' పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. గత ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. పదేళ్లలో 17 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.' అని పల్లా తెలిపారు. దీనిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు.

'వారికి ఏడాదికి రూ.12 వేలు'

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తాయనే ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ఆటో కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అభయమిచ్చిందన్నారు. ఏడాదికి వారికి రూ.12 వేలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్ లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 'రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అందరికీ అవకాశం ఇవ్వాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. పెట్టుబడిదారులను రాష్ట్రానికి స్వాగతిస్తాం. రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం.' అని పేర్కొన్నారు.

మీరు ఎప్పుడైనా సాయం చేశారా.?

అటు, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మండిపడ్డారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం రూ.530 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. 'మీరు ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా.? పదేళ్లలో నెలకు రూ.వెయ్యి అయినా ఇచ్చారా.?. సభను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు.' అని పొన్నం మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సమర్థిస్తున్నారా.? లేదా వ్యతిరేకిస్తున్నారా.? అనేది బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రశ్నించారు. 'మహిళలు బస్సుల్లో తిరిగితే మీకేంటి సమస్య.? భావోద్వేగాలు రెచ్చగొట్టడమే మీ నైజం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆటోలపై అసెంబ్లీకి

అంతకు ముందు బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివచ్చారు. ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో తరలివచ్చారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు.. హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఆసెంబ్లీకి వచ్చారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఫ్లకార్డులు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదే అయినా.. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపించాలని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, వారికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ అన్నారు. వీరిని పోలీసులు అడ్డుకోగా ఉద్రిక్తత తలెత్తింది. 

Also Read: Balka Suman: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోసం పోలీసుల గాలింపు - సీఎంను దూషించిన వ్యవహారంలో కేసు నమోదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget