Breaking News 24 September: సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
Breaking News 24 September Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు
విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైసీపీ నాయకుడ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సీలేరుకు చెందిన దివ్యాంగ మహిళపై ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన నాళ్ల వెంకటరావు(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఒడిశా రాష్ట్రంలోకి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా సీలేరు జలాశయం వద్ద చాకచక్యంగా పట్టుకున్నారు. నాళ్లవెంకటరావును అరెస్ట్ చేసి, వైద్య పరీక్షల కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. నర్సీపట్నం కోర్టులో హాజరుపరిచినట్లు గూడెం కొత్తవీధి సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు
ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన రద్దైంది. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సీఎం జగన్ కాలు బెణికింది. సాయంత్రానికి కూడా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో సీఎం రేపటి దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎం జగన్‌కు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత దిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే సమావేశంలో హోంమంత్రి పాల్గొంటారు.





















