News
News
వీడియోలు ఆటలు
X

Supreme Court : గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో పెట్టడంపై కేంద్రానికి నోటీసులు - సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !

తెలంగాణ గవర్నర్ బిల్లులు ఆమోదించకపోవడంపై దాఖలైన పిటిషన్‌ విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

FOLLOW US: 
Share:

Supreme Court :   తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  బిల్లులను ఆమోదించడంలేదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు  కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జాీర చేసింది. తదుపరి విచారణను  ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.  గవర్నర్‌ దగ్గర 10 పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. సోమవారం జరిగిన విచారణలో గవర్నర్‌కు నోటీసులు ఇవ్వవొద్దని సొలిసిటల్ జనరల్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు.  గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని తుషార్ మెహతా సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న బిల్లులలో కొన్నింటిని కొద్ది రోజుల క్రితమే పంపారని... అసలు విషయం ఏమిటో తెలుసుకొని కోర్టుకు నివేదిస్తానని చెబుతాన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. 

రాజ్ భవన్‌లో నెలల తరబడి పెండింగ్‌లో 10 అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క  బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో  ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్‌ తమిళి సై మరో మూడు   బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  దీంతో పది బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. బడ్జెట్‌ సమావేశాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది.   హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది, రాజ్‌భవన్‌ తరఫున న్యాయవాది చర్చల జరిపారు. ఇరువురి మధ్య సఖ్యత కుదరడంతో  బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. 

ఇటీవల పరిస్థితులు మెరుగుపడినట్లుగా కనిపించినా బిల్లులను ఆమోదించని గవర్నర్ తమిళిసై

ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న  బిల్లులకు కూడా ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటికీ గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. పైగా మరో మూడు బిల్లులపైనా నిర్ణయం తీసుకోలేదు.  విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం తెచ్చిన కామన్‌ రిక్రూట్‌మెంట్‌బోర్డు ఏర్పాటు కోసం , సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెచ్చిన బిల్లు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ, అజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ ఇలా ఏడు బిల్లులను ప్రభుత్వం తెచ్చింది. వీటిని అసెంబ్లీ, మండలిలో ఆమోదించి గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది.వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మాత్రమే గవర్నర్‌ ఆమోదించడంతో చట్టంగా రూపుదాల్చింది. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి.  తాజాగా ఉభయ సభలు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులు ఆమోదం తెలిపాయి. వీటికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదు. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గత సమావేశాల్లోని 7, తాజాగా 3 కలిపి మొత్తం పది బిల్లులపై గవర్నర్‌ ఆమోదించలేదు. వీటి కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ వెళ్లింది. 
 
వచ్చే సోమవరానికి గవర్నర్ బిల్లులు ఆమోదించడమో.. తిరస్కరించడమో చేస్తారా ? 

బిల్లుల ఆమోదంలేదా తిరస్కరణ విషయంలో కేంద్రానికి నోటీసులు జారీ చేయడంతో .. కేంద్రం ఈ బిల్లుల అంశంపై తన వాదన వినిపిచక తప్పదు. కేంద్రం ఏం చెబుతుందన్న దానిపై ఇతర అంశాలు ఆధారపడి ఉంటాయని భావిస్తున్నారు. 

Published at : 21 Mar 2023 03:52 PM (IST) Tags: Governor Tamilisai Supreme Court Central Govt Pending Bill

సంబంధిత కథనాలు

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్‌పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!

Adilabad: దీనావస్థలో ఆ కుటుంబం, ఇంటి పెద్దదిక్కుగా మారిన మూగ బాలిక ! సాయం కోసం ఎదురుచూపులు

Adilabad: దీనావస్థలో ఆ కుటుంబం, ఇంటి పెద్దదిక్కుగా మారిన మూగ బాలిక ! సాయం కోసం ఎదురుచూపులు

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TS Group-1: రేపే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!