అన్వేషించండి

Supreme Court: దానంపై రెండు వారాల్లో అనర్హతా తప్పదా? - సుప్రీంకోర్టు హెచ్చరికలతో కాంగ్రెస్‌కు సంకటం

Telangana Speaker: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ ముగించడానికి మరో రెండు వారాల గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది. దానం నాగేందర్ ఒక్కరి పరిస్థితే ఇప్పుడు కాంగ్రెస్‌కు సమస్యగా మారింది.

Disqualification petitions:  తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు  రెండు వారాల  గడువును డెడ్ లైన్‌గా విధించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసును విచారించింది.   ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేక మమ్మల్నే తీసుకోమంటారా అంటూ సూటిగా ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇదే చివరి అవకాశం - కోర్టు హెచ్చరిక 

ఈ కేసులో స్పీకర్ కార్యాలయం అనుసరిస్తున్న కాలయాపనపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫు న్యాయవాది మరో నాలుగు వారాల సమయం కోరగా, కోర్టు దానికి నిరాకరించింది.  ఇదే చివరి అవకాశం.. ఇంకా ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి  అని హెచ్చరిస్తూ, రెండు వారాల్లోగా తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని వివరిస్తూ అఫిడవిట్ ఇవ్వాలని, ఆ తర్వాతే అదనపు సమయం గురించి ఆలోచిస్తామని స్పష్టం చేసింది.

 దానం, కడియం, సంజయ్ భవితవ్యంపై ఉత్కంఠ

మొత్తం పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై పిటిషన్లు దాఖలు కాగా, స్పీకర్ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆధారాలు లేవని కొట్టివేశారు . అయితే, కీలకమైన  దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌ల అనర్హత పిటిషన్లు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన ఈ ముగ్గురిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో, సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుని రాజ్యాంగబద్ధంగా తన అధికారాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. కడియం శ్రీహరి, సంజయ్ తాము కాంగ్రెస్ లో చేరలేదని ఇప్పటికే స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దీంతో వారిద్దరిపై అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించవచ్చు. కానీ దానం నాగేందర్ ..ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఉండటంతో  ఆయనపై అనర్హతా వేటు తప్పదా అన్న  ప్రశ్నలు  వస్తున్నాయి. 

 ప్రజాస్వామ్య విలువలు - న్యాయ విచక్షణ                       

స్పీకర్ తీసుకున్న గత నిర్ణయాల్లోని లోపాలను తాము ఈ దశలో పరిశీలించలేమని, అభ్యంతరాలు ఉంటే విడిగా న్యాయ ప్రక్రియల ద్వారా రావాలని కోర్టు సూచించింది. అయినప్పటికీ, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం  స్ఫూర్తిని కాపాడటంలో స్పీకర్ వ్యవస్థ వేగంగా స్పందించాలని కోర్టు అభిప్రాయపడింది. రెండు వారాల తర్వాత జరగబోయే తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోబోతోందని ఆసక్తికరంగామారిది.                  

 

టాప్ హెడ్ లైన్స్

Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget