అన్వేషించండి

SSC Paper Leak: నీచ రాజకీయాల కోసమే పేపర్ లీకులు - టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పై మంత్రి వేముల ఫైర్

SSC Paper Leak: పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. నీచ రాజకీయాల కోసమే పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని తెలిపారు. 

SSC Paper Leak: పదో తరగతి పేపర్ లీక్ సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు లభించాయన్నారు. లక్షల మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో కూడా పట్టించుకోకుండా.. కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశంగా అని మంత్రి వేముల వివరించారు. అందుకోసమే కావాలని బీజేపీ నేతలు.. ప్రశాంత్ అనే వ్యక్తితో పదో తరగతి పరీక్ష పేపర్లను ఫొటో తీసి బండి సంజయ్ కి వాట్సాప్ ద్వారా పంపాడని తెలిపారు. పరీక్ష మొదలైన 15 నిమిషాల్లోనే బండి సంజయ్ కు ప్రశాంత్ ద్వారా పేపర్ వచ్చిందన్నారు. బండి సంజయ్, బీజేపీ వాళ్లతో ప్రశాంత్ 140 సార్లు ఫోన్లో మాట్లాడారని గుర్తు చేశారు. వాళ్లే ఉద్దేశపూర్వకంగా ప్రశ్నా పత్రాన్ని లీక్ చేశారన్నారు. 

కావాలని వాళ్లే మీడియాకి ప్రశ్నా పత్రాలను పంపించి లీక్ అయిందంటూ ధర్నాలు చేశారన్నారు. సోషల్ మీడియాలో పేపర్లు వైరల్ చేసి ప్రభుత్వం విఫలమైందంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నీచరాజకీయాల కోసం పిల్లల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని విమర్శించారు. బండి సంజయ్ పాత్ర పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఉందని.. పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే చట్టం తన పని తాను చేసుకుపోతుందని... బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేయడం దారుణం అన్నారు. 

బండి సంజయ్ తీరుపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఫైర్ ....

టీఎస్ పీఎస్సీ, పదో తరగతి పేపర్ లీక్ ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బండి సంజయ్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని చెప్పారు. మొన్న టీఎస్ పీఎస్సీలో జరిగిన లీక్ లో రాజశేఖర్ రెడ్డి పక్కా బండి సంజయ్ మనిషే అని... వాళ్లే దొంగతనం చేసి కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్ చేసిన వ్యక్తి ప్రశాంత్... ఆర్ఎస్ఎస్ మనిషన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గా ఉన్న బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్.. మత కల్లోలాలు సృష్టించే వ్యక్తి అని ఆరోపించారు. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. లీకేజీ వ్యవహారంపై సిట్.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి నోటీస్ లు పంపితే పారిపోతున్నారని అన్నారు. దేశంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అది చూసి ఓర్వలేకే బీజేపీ నీచ రాజకీయాల చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులు బీజేపీ ఉచ్చులో పడొద్దని సూచించారు. 

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయగా.. కేంద్రం నుంచి ఒక్క కాలేజీ కూడా రాలేదని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గుర్తు చేశారు. ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. బీజేపీ కి యువకులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలుగా గెలిచారని.. కానీ వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఏమాత్రం జరగటం లేదన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి టీఎస్ పీఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇద్దరూ ఒకే మాట మాట్లాడుతున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదన్నారు. 

అవినీతి లేని రాష్ట్రం తెలంగాణ: ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త

పేపర్ లీక్ వ్యవహారంలో బీజేపీ కుట్ర కచ్చితంగా ఉందని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి హిందీ పేపర్ వాట్సాప్ లో పెట్టారని తెలిపారు. బీజేపీ నేతలు విద్యార్థుల జీవితాలతో కూడా అడుకుంటున్నారన్నారు. సెక్రటేరియట్ ను కూల దోస్తామంటున్నారని.. విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాట అంటేనే రాహుల్ గాంధీపై కక్ష్య సాధిస్తున్నారని.. మరి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. అధికార దాహం కోసం బీజేపీ పాపాలు చేస్తోందని ఆరోపించారు. బండి సంజయ్ అనుచరుడే పేపర్ లీక్ చేశాడని... ప్రశాంత్, రాజశేఖర్ ప్రతి పేపర్ లీక్ చేసేందుకు యత్నించారన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget