అన్వేషించండి
Advertisement
Trains Cancelled: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఈ రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన
Telangana News: నిర్వహణ పనుల కారణంగా గోల్కొండ, శాతవాహన ఎక్ర్ ప్రెస్ రైళ్లతో పాటు కొన్ని రైళ్లను కొద్దిరోజులు రద్దు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
SCR Cancelled Some Trains In Telugu States: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు సికింద్రాబాద్ - పుణె మధ్య తిరిగే శతాబ్ధి సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజుల పాటు రద్ది చేసినట్లు చెప్పారు. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోని మూడో లైన్ పనుల కారణంగా ప్రయాణికులకు రైళ్ల సేవల్లో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
ఈ రైళ్లు రద్దు
- విజయవాడ - భద్రాచలం రోడ్ (07979), భద్రాచలం రోడ్ - విజయవాడ (07278), డోర్నకల్ - విజయవాడ (07755), విజయవాడ - డోర్నకల్ (07756) రైళ్లు ఆగస్ట్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ రద్దయ్యాయి.
- అలాగే, విజయవాడ - సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్ - విజయవాడ (12714) శాతవాహన ఎక్స్ ప్రెస్, గుంటూరు - సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ - గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ రద్దయ్యాయి.
- హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ (18046)తో పాటు సికింద్రాబాద్ - విశాఖ మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్ - గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్ - తిరుపతి మధ్య రాకపోకలు సాగించే కృష్ణా ఎక్ర్ ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
- పుణె - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్ర్ ప్రెస్ (12205) రైలు ఈ నెల 29, 31, ఆగస్ట్ 1వ తేదీల్లో రద్దైంది. సికింద్రాబాద్ - పుణె శతాబ్ది ఎక్స్ ప్రెస్ (12206) రైలు ఈ నెల 29, 31వ తేదీల్లో రద్దైంది.
- సికింద్రాబాద్ - ముంబయి ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12220) ఈ నెల 30న, ముంబయి - సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12219) ఈ నెల 31న రద్దయ్యాయి. అలాగే, నిజామాబాద్ - పుణె (11410) ఈ నెల 31న రద్దైంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion