Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి ప్రత్యేక రైళ్లు
Telangana News: తిరుమలకు వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. ఈ నెల 11, 13 తేదీల్లో ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
SCR Special Trains: వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతి సహా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఈ నెల 11న తిరుపతికి ప్రత్యేక సర్వీస్ నడపనున్నట్లు చెప్పారు. ఈ రైలు (07489) మే 11న రాత్రి 10:05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయిచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక సర్వీస్ (రైలు నెం. 07490) ఈ నెల 13న రాత్రి 07:50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మౌలాలి స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు ఈ సర్వీసులు వినియోగించుకోవాలని సూచించారు.
Summer Special Trains between various destinations pic.twitter.com/ituhfaBFjS
— South Central Railway (@SCRailwayIndia) May 3, 2024
మరిన్ని రూట్లలో
- మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ (రైలు నెం. 07009) ప్రత్యేక సర్వీస్ ఈ నెల 10వ తేదీన అందుబాటులో ఉంటుంది.
- అలాగే, సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07250) ప్రత్యేక రైలు ఈ నెల 11వ తేదీన అందుబాటులో ఉండనుంది.
- కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07057) ప్రత్యేక సర్వీస్ ఈ నెల 13న నడపనున్నారు.
- యశ్వంత్ పూర్ - బీదర్ (06227) ఈ నెల 6వ తేదీన, బీదర్ - యశ్వంత్ పూర్ (06228) ఈ నెల 7న అందుబాటులో ఉండనున్నాయి.
- కాచిగూడ - కాకినాడ టౌన్ (07025) ప్రత్యేక రైలు ఈ నెల 9వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఉండనుంది.
- ఈ నెల 10 తేదీన కాకినాడ టౌన్ - కాచిగూడ (07026) ప్రత్యేక రైలు సాయంత్రం 5:10 గంటలకు బయలుదేరుతుంది.
- ఈ నెల 13న నాందేడ్ - కాకినాడ టౌన్ (07487) మధ్యాహ్నం 2:25 గంటలకు బయలుదేరనుంది. 14న కాకినాడ టౌన్ - నాందేడ్ (07488) సాయంత్రం 6:30 గంటలకు బయలుదేరుతుంది.
- అలాగే, ఈ నెల 11న హైదరాబాద్ - నరసాపురం రైలు (07175) రాత్రి 11 గంటలకు, ఈ నెల 13వ తేదీన నరసాపురం - హైదరాబాద్ (07176) ప్రత్యేక రైలు సాయంత్రం 6 గంటలకు అందుబాటులో ఉండనుంది.
సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య
మరోవైపు, రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ (Secunderabad) - సంత్రగాచి (Santragachi) - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ - సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకూ ప్రతి ఆదివారం, అలాగే, సంత్రగాచి - సికింద్రాబాద్ (07235) మధ్య జులై 2 వరకూ ప్రతి మంగళవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రతి ఆదివారం రాత్రి 11:40 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 5:50 గంటలకు సంత్రగాచి చేరుతుంది. అలాగే, సంత్రగాచి - సికింద్రాబాద్ మధ్య రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
Summer Special Trains between various destinations pic.twitter.com/ituhfaBFjS
— South Central Railway (@SCRailwayIndia) May 3, 2024
ఈ రైళ్లు పొడిగింపు
అటు, రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ - రామాంతపూర్ (07695) జూన్ 26 వరకూ, రామాంతపూర్ - సికింద్రాబాద్ (07696) జూన్ 28 వరకు పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే, సికింద్రాబాద్ - దిబ్రుఘర్ (07046) జూన్ 24 వరకూ, దిబ్రుఘర్ - సికింద్రాబాద్ (07047) జూన్ 27 వరకూ పొడిగించినట్లు చెప్పారు.
Extension of Summer Special Trains pic.twitter.com/5H01lKkzaR
— South Central Railway (@SCRailwayIndia) May 1, 2024
Also Read: Elections 2024 : మీ బిడ్డ భూములిస్తాడు కానీ లాక్కోడు - ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై జగన్ క్లారిటీ