Telangana High Court: సిద్దిపేట మాజీ కలెక్టర్‌కు హైకోర్టులో షాక్.. ఆయనతో క్షమాపణ చెప్పిస్తామన్న ప్రభుత్వం
కలెక్టర్ వ్యాఖ్యల నేపథ్యంలో సింగిల్ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామి రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సిద్దిపేట మాజీ కలెక్టర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకూ సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో వరి పంట వేయొద్దని చెప్పే క్రమంలో ఆ వ్యాఖ్యలు చేశారు. వరి విత్తనాలు ఎవరూ అమ్మకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా సరే తాను ఖాతరు చేయనని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
కలెక్టర్ వ్యాఖ్యల నేపథ్యంలో సింగిల్ జడ్జి సిఫారసు చేసిన పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ వెంకట్రామి రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, క్షమాపణ చెప్పాలని కూడా పేర్కొంది. అయితే, దీనిపై ప్రభుత్వం తరపు వాదనలు వినిపించే అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో క్షమాపణలు చెప్పిస్తామని.. ఆయన స్టేట్‌మెంట్ నమోదు చేసి కోర్టుకు సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామా రెడ్డి రాజీనామా వివాదంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సుబేందర్ సింగ్, జే.శంకర్ అనే వ్యక్తులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా, ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్‌లో ఫలితం లేదని పిటిషర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ నామినేషన్‌ను రద్దు చేయాలన్న పిల్‌ను పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు.
Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్