YS Sharmila : కేసీఆర్‌కు పరీక్ష పెట్టిన షర్మిల - దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ !
కేసీఆర్ కు ఇవే చివరి ఎన్నికలని షర్మిల వ్యాఖ్యానించారు. ఇందిరాపార్క్ లో నిరుద్యోగ దీక్షలో ఆమె పాల్గొన్నారు.
YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ష్రమిల T - SAVE తరుపున కేసీఅర్ కి ఒక ప్రశ్న పత్రం పంపుతున్నామని.. ఇందులో పడి పది ప్రశ్నలు ఉన్నాయని వాటికి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీ సేవ్ ఆధ్వరంలో నిరుద్యోగుల దీక్షను ఇందిరాపార్క్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల .. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మా T - SAVE దీక్ష కు మొదట్లో అనుమతి ఇవ్వలేదని... కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. అయినా దీక్ష ను ఆపాలని ప్రయత్నాలు చేసి.. తనను అరెస్ట్ చేశారన్నారు. సిట్ ఆఫీస్ కి వెళ్తుంటే పథకం ప్రకారమే నన్ను అడ్డుకున్నారని...మండిపడ్డారు. సిట్ ఆఫీస్ కి నేను ఒక్క దాన్నే వెళ్ళాలని అనుకున్న ఒక్క మహిళను అడ్డుకోవడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ దిగారని ఆరోపించారు.
ఒక్క పేపర్ ముక్క ఇవ్వడానికి నన్ను అడ్డుకోవాలా..? నన్ను అడ్డుకొనేందుకు ఏమి ఆర్డర్స్ లేవన్నారు. నన్ను హౌజ్ అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ కూడా లేవు.. నేను ఎందుకు తగ్గాలని ఆమె ప్రశ్నించారు. తాను ను పోరాటం చేస్తున్నది నిరుద్యోగుల కోసమని.. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు కాకపోతే అమలు కావాలని చేసే పోరాటం...YSR పాలన ఎక్కడ లేదు కాబట్టి నా పోరాటం అన్నారు. ప్రతిపక్షాలు నోరు మూసుకొని కూర్చుంటే ప్రజల పక్షాన నిలబడాలని నా పోరాటం అని చెప్పుకొచ్చారు. ఇదే ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగుల పక్షాన 72 గంటల పాటు పోరాటం చేశామని గుర్తు చేశారు.
ప్రతి మంగళవారం నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేశానని నన్ను ఎన్ని మాటలు అన్నా నిరుద్యోగుల పక్షాన నిలబడ్డానన్నారు. రాష్ర్టంలో నిరుద్యోగ సమస్య ఉంది అని ఎత్తి చూపింది తానేనన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళలు అంటే లెక్కే లేదని విమర్శింారు. విజయమ్మ YSR హయాంలో పోలీస్ శాఖ ఒక వెలుగు వెలిగిందని.. ఇప్పుడు పోలీసులను కేసీఅర్ పని మనుషులు గా వాడువాడుకుంటున్నారని ారోపించారు. పోలీస్ శాఖ అంటే తనకు గౌరవం అని.. పోలీసులను అవమాన పరచడం ఉద్దేశ్యం కాదని షర్మిల స్పష్టం చేశారు. సీఅర్ కుటుంబం మొత్తం స్కాంలేనని ఆరోపించారు. 2000 ఐటీ శాఖ చట్టం ప్రకారం ప్రభుత్వ పరిధిలో వాడే ప్రతి కంప్యూటర్ కి ఆడిట్ జరగాల్సి ఉందన్నారు. కానీ ఐటీ మంత్రి దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేటీఆర్ అమెరికా లో ఐటీ ఉద్యోగం చేశాడట .. ఐటీ ఉద్యోగం చేసిన కేటీఆర్ కి ఫైర్ వాల్స్ అంటే తెలియదా అని ఎద్దేవా చేశారు.
మీకు దమ్ముంటే CBI విచారణ చేయించాలని కేటీఆర్‌కు ష్రమిల సవాల్ విసిరారు. కొండను తవ్వి ఎలకలను పట్టడం కాదు.. వెనుక ఉన్న తిమింగలాలు పట్టాలన్నారు. టీ సేవ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో గద్దర్ కూడా పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ప్రభుత్వంపై షర్మిల పోరాడుతోందని అన్నారు. అప్పులు చేసి కోచింగ్లు తీసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుతోనే సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాడానికి నిర్ణయించుకున్నారు. ఉద్యమమప్పడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవు. ఇప్పడు ఉన్నాయి. మన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి. యువత రాజకీయ శక్తిగా మారితేనే మార్పు సాధ్యమవుతుంది. షర్మిల అలా మారినందుకే ఆమె పోరాటాలను అణిచివేయాలని చూస్తున్నారు. తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప కష్టాలు తీరలేదని దగ్గర్ వ్యాఖ్యానించారు.