అన్వేషించండి

Telangana: సెప్టెంబర్‌ 17కు కొత్త పేరు పెట్టిన రేవంత్ సర్కార్, జిల్లాలవారీగా జెండా ఎగురవేసేది వీరే

September 17 : సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది.

Telangana Praja Palana Dinotsavam : సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు. ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ.. నిరంకుశపాలనను బద్దలు కొట్టి ప్రజాస్వామ్యంలో ఏకమైన రోజు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ రాష్ట్రం.. భారతదేశంలో కలిసిన రోజు. అయితే ఈ సెప్టెంబర్ 17 ప్రతేడాది తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తుంది. సెప్టెంబరు 17 నాటికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రచ్చ తప్పడం లేదు. ఈ రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటుంది.


దీంతో ఈ సారి సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 33 జిల్లాల్లో జెండాను ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ రోజున రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేయనున్నారని తెలిపింది. 

జెండా ఎగురవేసే ప్రజాప్రతినిధులు ఎవరంటే 
* ఆదిలాబాద్ - షబ్బీర్ అలీ (ప్రభుత్వ సలహాదారు) 
*  భద్రాద్రి కొత్తగూడెం - తుమ్మల నాగేశ్వర రావు(వ్యవసాయ శాఖ మంత్రి)
* హన్మకొండ -కొండా సురేఖ (పర్యావరణ & అటవీ, దేవాదాయ శాఖ మంత్రి)
* జగిత్యాల - ఎ. లక్ష్మణ్ కుమార్(ప్రభుత్వ విప్)
* జయశంకర్ భూపాలపల్లి - పోడెం వీరయ్య( ఛైర్మన్ తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)
* జనగాం- బీర్ల ఇల్లయ్య( ప్రభుత్వం విప్)
* జోగులాంబ గద్వాల్- ఏపీ జితేందర్ రెడ్డి  (ప్రభుత్వ సలహాదారు) (క్రీడా వ్యవహారాలు)
* కామారెడ్డి- పటేల్ రమేష్ రెడ్డి (ఛైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్)
* కరీంనగర్ -డి.శ్రీధర్ బాబు (ఐటీ మంత్రి)
*  ఖమ్మం - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* కుమురంభీమ్ ఆసిఫాబాద్-బండ ప్రకాష్ (శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్)
* మహబూబాబాద్ - జె. రాంచందర్ నాయక్ (ప్రభుత్వ విప్)
* మహబూబ్ నగర్ -జూపల్లి కృష్ణరావు (ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మంత్రి)
*  మంచిర్యాల- హరకర వేణుగోపాలరావు (ప్రభుత్వ సలహాదారు)
* మెదక్ - కె. కేశవ రావు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)
* మేడ్చల్ -పట్నం మహేందర్ రెడ్డి (ఎమ్మెల్సీ)
* ములుగు - మంత్రి సీతక్క
* నాగర్‌కర్నూల్- జి. చిన్నారెడ్డి (వైస్-ఛైర్మన్, ప్లానింగ్ బోర్డ్)
* నల్గొండ- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
*  నారాయణపేట - గురునాథ్ రెడ్డి (తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్)
*  నిర్మల్ - రాజయ్య (సిరిసిల్లా చైర్‌పర్సన్, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్)
* నిజామాబాద్ - అనిల్ ఎరావతి (తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ చైర్‌పర్సన్)
*  పెద్దపల్లి - నేరెళ్ల శారద (తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్)
*  రాజన్న సిరిసిల్ల- ఆది శ్రీనివాస్ (ప్రభుత్వ విప్)
*  రంగారెడ్డి- వేం నరేందర్ రెడ్డి (ముఖ్యమంత్రి సలహాదారు)
*  సంగారెడ్డి- మంత్రి దామోదర రాజనరసింహ
* సిద్దిపేట - మంత్రి పొన్నం ప్రభాకర్
* సూర్యాపేట- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
* వికారాబాద్ - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
* వనపర్తి - ప్రీతమ్ (చైర్‌పర్సన్, తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్)
* వరంగల్ - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* యాదాద్రి భువనగిరి - గుత్తా సుఖేందర్ రెడ్డి (గౌరవ చైర్మన్, టీఎస్ఎల్ సీ)


గత కొంత కాలంగా సెప్టెంబర్ 17 నిర్వహణపై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవంగా జరుపుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ మేరకు సర్కార్ బుధవారం (సెప్టెంబర్ 11)న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ విమోచనోద్యమంలో అమరవీరులయిన వారికి గౌరవసూచకంగా ప్రతేడాది సెప్టెంబర్‌ 17ని హైదరాబాద్‌ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇక, గత రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2022,2023లలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక నిర్వహించగా రెండు సందర్భాల్లో ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించడం వారికి పెద్ద విషయమేమీ కాదు: హరీష్ రావు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget