అన్వేషించండి

D Srinvias Health: ఇంకా విషమంగానే ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్యం, ఐసీయూలో చికిత్స

D Srinvias: కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శ్వాస తీసుకోవటానికి శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నట్లు సిటీ న్యూరో వైద్యులు తెలిపారు.

D Srinvias: కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. శ్వాస తీసుకోవటానికి డి. శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నట్లు సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. 48 గంటల‌ పాటు అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్చారు. గత రెండు రోజులుగా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. డీఎస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన అభిమానులు ఇప్పటికే సిటి న్యూరో ఆస్పత్రికి తరలివస్తున్నారు.

గతంలో పక్షవాతం
డీఎస్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అంతకు ముందు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ దెబ్బతో పక్షవాతానికి గురయ్యారు. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఇదే సిటీ న్యూరో సెంటర్‌కు తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. కొద్ది రోజుల తర్వాత డీఎస్ కోలుకున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం డీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  డీఎస్ ఆరోగ్యంగా తిరిగి రావాలని పూజలు చేస్తున్నారు. డీఎస్ ఆరోగ్యంపై కాంగ్రెస్ కీలక నేతలు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు.

రాజకీయ ఉద్ధండుడు
1948, సెప్టెంబరు 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించిన డి.శ్రీనివాస్...నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. డీఎస్ పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సాగింది. పార్టీలో ఉన్నత పదవులను చేపట్టారు. 1989లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి...తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొందారు.  తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డీ శ్రీనివాస్ ను మంత్రి పదవి వరించింది. 1998లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడించి రెండవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు.

2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చినా.. డీఎస్ మాత్రం ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 

2014లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయారు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... గులాబీ పార్టీలో చేరారు. కేసీఆర్ రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసే వరకు కూడా ఆ పార్టీలో ఉన్నా, కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.కొంతకాలానికి బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
డీఎస్‌కు ఇద్దరు కుమారులు.. ఒకరు సంజయ్, మరోకరు అరవింద్. సంజయ్ కార్పొరేటర్ విజయం సాధించి...నిజామాబాద్ మేయర్ గా పని చేశారు. మరో కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరి, ఎంపిగా విజయం సాధించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget