By: ABP Desam | Updated at : 17 May 2023 11:48 AM (IST)
Edited By: jyothi
సీఈఐఆర్‌తో చోరీకి గురైన 2,43,875 ఫోన్ల గుర్తింపు, నేటి నుంచి మరో పోర్టల్ అందుబాటులోకి! ( Image Source : Sanchar Saathi Official Website )
Sanchar Saathi: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా ఇప్పటి వరకు చోరీకి గురైన, కనిపించకుండా పోయిన 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్లు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ చాలా ప్రయోజనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్ లోని సీటీవో భవనంలో అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రయోజనాలు వెల్లడించారు. ఈ పోర్టల్ లోని టాప్‌కాఫ్( టీఏఎఫ్సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ సదుపాయంతో నకిలీ ఫోన్ నంబర్లను గుర్తించి వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
టాప్‌కాఫ్‌ను ఏపీఎల్ఎస్ఏ విజయవాడ బ్రాంచ్ రూపొందించిందని.. దానిని ఏడాదిన్నరగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40.87 లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 లక్షల కనెక్షన్లను రద్దు చేసినట్లు వివరించారు.
ఒకటి, రెండూ కాదు ఎన్నో ప్రయోజనాలు
తాజాగా ప్రారంభమైన సంచార్ సాథీ పోర్టల్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే మొబైల్ ఫోన్ల ద్వారా జరిగే నేరాలను అరికట్టడానికి సంచార్ సాథీ పోర్టల్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మధ్యే తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ కూడా సంచార్ సాథీ పోర్టల్ లో మొదటి అడుగుగా అభివర్ణించారు కేంద్రమంత్రి. ఫోన్ పోయినప్పుడు ఆ ఫోన్ లోని సమాచారాన్ని ఎవరూ చూడకుండా దానిని సంచార్ సాథీ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయవచ్చని వెల్లడించారు. డిజిటల్ ఐడెంటిటీ కోల్పోకుండా చూడటం ఒక అంశంగా పేర్కొన్నారు. నో యువర్ మొబైల్ అనే రెండో ఫీచర్ గురించి వివరించారు.
Alo Read: మొబైల్ పోగొట్టుకున్నారా? అయితే ఈ పోర్టల్‌లో ట్రాక్ చేసుకోవచ్చు
మన పేరుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవచ్చు
ఆధార్ కార్డు ఉంటే సిమ్ తీసుకోవడం చాలా సులభం. అయితే ఒకరి పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో.. వాటిని ఎక్కడెక్కడ తీసుకున్నారో సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించారు. వ్యక్తులకు తెలియకుండా వారి పేరుపై ఉన్న సిమ్ లను ఈ పోర్టల్ ద్వారా తొలగించే అవకాశం ఉంది. ఆధార్ కార్డు నంబరు సాయంతో నకిలీల గురించి తెలుసుకోవచ్చు. దొంగిలించిన ఫోన్ లొకేషన్ కనుక్కోవడంతో పాటు లీగల్ విధానంలో ఒక ఫోన్ ను పని చేయకుండా చేయవచ్చు. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫోన్లకు డిటోగా ఉండే క్లోన్ ఫోన్లు మార్కెట్లో తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. వీటిని ఒరిజినల్ ఫోన్ గా భ్రమింపజేసే అమ్మే వారు కూడా ఉంటారు. అలాంటి పరిస్థితిలో అది నిజమైనదో కాదో తెలుసుకోవడానికి సంచార్ సాథీ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఫోన్ ఐఎంఈఐ నంబరు సాయంతో ఆ ఫోను నిజమైనదా, నకిలీదా సులభంగా తెలుసుకోవచ్చు.
Alo Read: 'సంచార్ సాథీ' పోర్టల్ తీసుకొచ్చిన కేంద్రం, ఫోన్ నేరాలు అరికట్టడమే లక్ష్యం
Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!
తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!
TS PGECET: జూన్ 8న తెలంగాణ పీజీఈసెట్ ఫలితాల వెల్లడి, రిజల్ట్ టైమ్ ఇదే!
BRS News: బీఆర్ఎస్‌లో చేరిన 50 మంది మహారాష్ట్ర సర్పంచ్‌లు, మధ్యప్రదేశ్ కీలక వ్యక్తి కూడా
Civils Coaching: సివిల్స్ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!
Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!
LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!