RS Praveen Kumar: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లెక్కలు బయటపెట్టాలని డిమాండ్
Telangana CM Revanth Reddy: ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత 4 నెలల్లో చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేశారు.
BRS Leader RS Praveen Kumar: హైదరాబాద్: బీఎస్పీ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదే పదే అప్పులు అప్పులు అని ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ 4 నెలల పాలనలో ఎన్ని అప్పులు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ అప్పుల లెక్క చెప్పండి
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ₹6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల్లోనే ₹16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని చెప్పారు. అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్పీ అభిప్రాయపడ్డారు. ఆ అప్పులను కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లలో చూపించరని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ అప్పులు చేసి రాష్ట్రంలో కనీసం మౌళిక సదుపాయాలైనా కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వంలో వాటి ఊసే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు కేవలం 6 గ్యారంటీల గారడి మాత్రమే చేస్తున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు నెలల్లో మీరు చేసిన అప్పుల మీద కూడా ఏదీ దాచకుండా శ్వేత పత్రం విడుదల చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ₹6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని గగ్గోలు పెట్టిన కాంగ్రేసు ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే ₹16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నయి! ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటయి. వాటిని బడ్జెట్లలో…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 20, 2024